ప్రధాని ఇంటి నుంచి పార్లమెంట్‌కు సొరంగ మార్గం

  • Published By: madhu ,Published On : February 5, 2020 / 02:27 PM IST
ప్రధాని ఇంటి నుంచి పార్లమెంట్‌కు సొరంగ మార్గం

దేశ ప్రధాని, ఇతర VVIPలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు, పార్లమెంట్‌కు నేరుగా వెళ్లడానికి సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సెంట్రల్ విస్టా ఈ మేరకు ప్రతిపాదన ఈ ప్రతిపాదన తెచ్చింది. ఈ మేరకు ప్రాజెక్టు రూపకర్త బిమల్ పటేల్ వెల్లడించారు. వీఐపీలు వెళ్లిన సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధిక సెక్యూర్టీ కలిగిన ప్రధాని వంటి వ్యక్తులను సాధారణ ట్రాఫిక్ నుంచి వేరు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ క్రమంలో ప్రధాని నివాసం నుంచి పార్లమెంట్‌కు నేరుగా ఓ టన్నెల్ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ సంస్థల బిల్డింగ్స్, ప్రభుత్వ భవనాలను మార్చడానికి..వీటికి కొత్త రూపు కల్పించడానికి సెంట్రల్ విస్టా సరికొత్త ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రధాన మంత్రి నివాసం నుంచి పార్లమెంట్ వరకు సొరంగం ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

ప్రత్యేక టన్నెల్ ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య తీరుతుందని బిమల్ పటేల్ వెల్లడించారు. VVIPలకు భద్రత కల్పించడం చాలా సులువు అవుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న రక్షణ సిబ్బంది కార్యాలయాలు తొలగించబడుతాయని, ఇక్కడ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.