Principal to touch student’s feet: స్టూడెంట్స్ రౌడీయిజం.. విద్యార్థిని కాళ్లు పట్టుకుని ప్రిన్సిపాల్ క్షమాపణలు!
అహ్మాదాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్.. ఓ విద్యార్థి కాళ్ళు మొక్కుతూ..తనను క్షమించమని అడిగారు. ఇదంతా ABVP నాయకుల ఆధ్వర్యంలో జరిగింది.

Principal to touch student’s feet: విద్యార్థులు తప్పు చేస్తే.. ఉపాధ్యాయులు దండిస్తారు. సరిగ్గా చదవకపోయినా, చెడు వ్యసనాలకు బానిసైన గురువులే మార్గంలో నడిపిస్తారు. అలాంటి ఓ ఉపాధ్యాయుల పట్ల మనం గౌరవ, మర్యాదలతో ఉండాలి. కానీ అందుకు విరుద్ధంగా ఓ ప్రిన్సిపాల్. ఓ విద్యార్థి పాదాలకు తాకాల్సి వచ్చింది. అహ్మాదాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్.. ఓ విద్యార్థి కాళ్ళు మొక్కుతూ..తనను క్షమించమని అడిగారు. ఇదంతా ABVP నాయకుల ఆధ్వర్యంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్ల, రాష్ట్ర విద్యా వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఎస్ఏఎల్ డిప్లమో కాలేజీకు చెందిన ఓ విద్యార్థినికి రెండో సెమిస్టర్లో అటెండెన్స్ షార్టేజ్ వచ్చింది. ఈ విషయంపై ABVP నాయకుడు అక్షత్ జైస్వాల్.. ఇతర ఏబీవీపీ సభ్యులతో కలిసి ప్రిన్సిపాల్ మోనికా స్వామి ఛాంబర్‌కి వెళ్లారు. ప్రిన్సిపాల్‌పై వాగ్వాదానికి దిగారు. దీంతో ప్రిన్సిపాల్ బలవంతంగా విద్యార్థిని పాదాలకు తాకి.. క్షమాణాలు చెప్పాల్సి వచ్చింది. ఈ ఘటనపై కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషన్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏబీవీపీ కార్యకర్తల చర్య సిగ్గు చేటని.. NSUI జాతీయ కన్వీనర్ భావిక్ సోలంకి పేర్కొన్నారు. ABVP కార్యకర్తలు రౌడీయిజానికి పాల్పడుతున్నారనడానికి ఈ ఘటనే నిదర్శమన్నారు.
మరోవైపు జైస్వాల్ చర్యకు క్షమాపణలు చెబుతూ ABVP ఓ ప్రకటన విడుదల చేసింది. ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య ఉన్న పవిత్ర సంబంధాన్ని ABVP విశ్వసిస్తుంది. ఇలాంటి ఘటనకు ABVP ఎన్నటికీ క్షమించదని ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి ప్రార్థన్ అమిన్ తెలిపారు. దీంతో అక్షత్ జైస్వాల్ ను సంస్థ నుంచి బహిష్కరించారు. అనంతరం ABVP సీనియర్ నాయకులు.. ప్రిన్సిపాల్ మోనికా స్వామి దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పారు.
ગુરૂ ની ગરિમા ને તાર- તાર કરનાર @ABVPGujarat નાં નેતાઓ સામે @jitu_vaghani શિક્ષણ વિભાગ ખુદ ફરિયાદી બને – @NSUIGujarat @Neerajkundan@jagdishthakormp @Pawankhera @rssurjewala @drmanishdoshi@IG_Gohil_ @SatveerINC @Mahipalsinh_INC#SameOnABVP#एबीवीपी_के_गुंडे pic.twitter.com/IBXsYc87H8
— Bhavik Solanki (@bhaviksolankee) May 13, 2022
1Maharashtra Politics : తన వద్ద ఉన్న ఎమ్మెల్యేలను మీడియాకు చూపించి..బలప్రదర్శనకు రె‘ఢీ’ అంటున్న ఏక్ నాథ్ షిండే..
2Vijaya Reddy: పేదలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీనే: కార్పొరేటర్ విజయా రెడ్డి
3AIADMK: అన్నాడీఎంకేలో తారస్థాయికి వివాదం.. పన్నీర్ సెల్వంపై దాడికి యత్నం
4చైతూ-కృతిశెట్టి కాంబో రెండోసారి.. పూజా కార్యక్రమాలతో మొదలైన NC22..
5CM KCR: కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు.. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
6NC 22 : మరోసారి చైతూ-కృతిశెట్టి కాంబో.. క్లాప్ కొట్టిన బోయపాటి..
7Ranji Trophy: సెంచరీ బాది తీవ్ర భావోద్వేగంతో సర్ఫరాజ్ ఖాన్ కన్నీరు.. వీడియో
8Viral News: మహిళ తాకితే స్పృహ కోల్పోతున్న వృద్ధుడు.. వైద్యులు ఏం చేశారంటే..
9’IKIGAI‘ The Japanese Secrets : జపాన్వాసుల ఆయుర్దాయం వెనక ‘ఇకిగయ్’ సీక్రెట్..
10IIT-Delhi Student: ప్రపంచంలోనే టాప్ కోడర్‌గా గెలిచిన ఐఐటీ-స్టూడెంట్
-
Miami Airport Plane : విమానంలో ఒక్కసారిగా మంటలు.. తప్పిన పెనుప్రమాదం..!
-
Patna High Court : జడ్జీల కోసం ఐఫోన్ 13ప్రో తక్కువ ధరకే కొననున్న పట్నా హైకోర్టు..!
-
Telegram Premium : టెలిగ్రామ్ మానిటైజేషన్ ప్లాన్ వచ్చేసింది.. ప్రీమియంతో బెనిఫిట్స్ ఏంటి?
-
Ramarao On Duty: రామారావు చార్జి తీసుకునేది అప్పుడే!
-
Xiaomi 12 Ultra : షావోమీ 12 అల్ట్రా ఫోన్ వస్తోంది.. జూలైలోనే లాంచ్..!
-
Salman Khan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న సల్మాన్ ఖాన్
-
Samsung Galaxy F13 : శాంసంగ్ గెలాక్సీ F13 వచ్చేసింది.. ఈ నెల 29 నుంచే సేల్.. ధర ఎంతంటే?
-
Vaarasadu: ‘వారసుడు’ రాకతో నిజమైన సంక్రాంతి..!