Assam: బెయిల్ ఇవ్వాలంటూ నిరాహార దీక్షకు దిగిన 112 మంది ఖైదీలు

అభ్యర్ధన కాపీలు జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థకు పంపినట్లు పేర్కొన్నారు. నేరం రుజువైతే శిక్షను స్వీకరిస్తామని, అంతకు ముందు తమను నేరస్తులుగా పరిగణించరాదని ఖైదీలు చెప్పారు. అయితే ఈ విషయమై కరీంగంజ్ జిల్లా జైలు సూపరింటెండెంట్ మృణ్మోయ్ దావ్కా, డిప్యూటీ కమిషనర్ మృదుల్ యాదవ్ వ్యాఖ్యానించడానికి నిరాకరించారు

Assam: బెయిల్ ఇవ్వాలంటూ నిరాహార దీక్షకు దిగిన 112 మంది ఖైదీలు

Prisoners on indefinite hunger strike demanding bail

Assam: అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న 112 మంది ఖైదీలు బెయిల్ డిమాండ్ చేస్తూ మంగళవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. బెయిల్ కోసం తమ పక్షాన్ని పంపడానికి దారులు మూసివేశారని, తమను బయటికి రాకుండా అడ్డుకుంటున్నారని గువహాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి దాఖలు చేసిన పిటిషన్‌లో వారు పేర్కొన్నారు.

RRR: ఆ మార్వెల్ సూపర్ హీరోల పాత్రల్లో నటించేందుకు సై అంటోన్న తారక్, చరణ్‌లు!

“మేము నిందితులమే. అయినంత మాత్రాన మాకు చట్టం పని చేయకుండా పోతుందా? చట్ట ప్రకారమే మేము జైలుకు వచ్చాము. అదే చట్టం జైలులో ఉన్న ఖైదీలకు కూడా రక్షణ, అవకాశాల్ని కల్పిస్తుంది. చట్టాన్ని ఆశ్రయించే హక్కు మాకు ఉంది. బెయిల్ విచారణల సమయంలో, మా తరపున సాక్ష్యం చెప్పకుండా సాక్షులను అడ్డుకుంటున్నారు. మా సాక్షులకు అధికారులు సరిగా నోటీసులు జారీ చేయడం లేదు’’ అని గువహాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి దాఖలు చేసిన పిటిషన్‭లో సదరు ఖైదీలు పేర్కొన్నారు. తమను అమానవీయంగా జైల్లో ఉంచుతున్నారని ఖైదీలు తెలిపారు. “175 మంది వ్యక్తులు నివసించే గదిలో 500 మందికి పైగా ఖైదీలను ఉంచారు. ఇది అమానవీయం” అని వారు వాపోయారు.

Lakshadweep MP: మర్డర్ అటెంప్ట్ కేసులో లక్షద్వీప్ ఏకైక ఎంపీకి 10 ఏళ్ల జైలు శిక్ష

అభ్యర్ధన కాపీలు జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థకు పంపినట్లు పేర్కొన్నారు. నేరం రుజువైతే శిక్షను స్వీకరిస్తామని, అంతకు ముందు తమను నేరస్తులుగా పరిగణించరాదని ఖైదీలు చెప్పారు. అయితే ఈ విషయమై కరీంగంజ్ జిల్లా జైలు సూపరింటెండెంట్ మృణ్మోయ్ దావ్కా, డిప్యూటీ కమిషనర్ మృదుల్ యాదవ్ వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. కరీంగంజ్‌లో ఎన్‌డీపీఎస్ చట్టం కింద అరెస్టయిన 224 మంది నిందితులు జిల్లా జైలులో ఉన్నారని, కొన్నాళ్లుగా వీరికి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఖైదీలు తెలిపారు.