తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు రైళ్లు.. రూట్లు, టైమింగ్స్ ఇవే!

  • Published By: vamsi ,Published On : July 10, 2020 / 10:01 AM IST
తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు రైళ్లు.. రూట్లు, టైమింగ్స్ ఇవే!

పియుష్ గోయల్ నేతృత్వంలో భారత రైల్వే రూ.30వేల కోట్ల మెగా ప్రైవేట్ రైళ్ల ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది కేంద్ర రైల్వే శాఖ. దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో ప్రైవేటు రైళ్లను నడిపించేందుకు నిర్ణయం తీసుకున్న కేంద్రం.. సికింద్రాబాద్ క్లస్టర్‌లో పది రూట్లను ఎంపిక చేసింది. ఈ రూట్లలో విమానాల తరహాలో రైళ్లను నిర్వహించేందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది కేంద్రం.

దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లను ఏర్పాటు చేసిన రైల్వే శాఖ మరో ఆరు నెలల్లో ప్రైవేటు రైళ్లను పరుగులు పెట్టించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ క్లస్టర్‌లో నడిచే ప్రైవేటు రైళ్ల వివరాలు పరిశీలిస్తే, సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం, గుంటూరు, తిరుపతి, ముంబై, హౌరా మార్గాలు, విశాఖ నుంచి బెంగళూరు, విజయవాడ మార్గాలు ఉన్నాయి. వీటితో పాటు ముంబై – ఔరంగాబాద్ మార్గం కూడా సికింద్రాబాద్ క్లస్టర్ పరిధిలోకి వచ్చింది.

ఇక ప్రైవేటు రంగం తయారుచేసే ఆధునిక రైళ్లు ఎక్కువగా ‘ మేక్ ఇన్ ఇండియా’లో ఉంటాయి.

క్లస్టర్ 9 పరిధిలోకి వచ్చే సికింద్రాబాద్ మార్గంలోని రూట్లు.. పూర్తి వివరాలు..

సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం ద్వారా విశాఖకు 13 గంటల 45 నిమిషాల్లో రైలు (19:45 నుండి 09:30 వరకు)
శ్రీకాకుళం వయా విశాఖ నుంచి సికింద్రాబాద్ వరకు 14 గంటల్లో రైలు (1500 నుండి 05:00 వరకు)
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 12 గంటల 15 నిమిషాల్లో రైలు (06:00 నుండి 18:15 వరకు)
తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు 12 గంటల 15 నిమిషాల్లో రైలు (08:40 నుండి 20:55 వరకు)
గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు 4 గంటల 45 నిమిషాల్లో రైలు (23:30 నుండి 04:15)
సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు 4 గంటల 45 నిమిషాల్లో రైలు (23:30 నుండి 04:15)
గుంటూరు నుంచి కర్నూలుకు 8 గంటల్లో రైలు (06:00 నుండి 14:00 వరకు)
7 గంటల 40 నిమిషాల్లో కర్నూలు నుంచి గుంటూరుకు రైలు (14:50 నుండి 22:30 వరకు)
తిరుపతి వయా సికింద్రాబాద్ నుంచి వారణాసికి 33 గంటల 45 నిమిషాల్లో రైలు (22:00 నుండి 07:45)
వారణాసి నుంచి సికింద్రాబాద్ మీదుగా తిరుపతికి 33 గంటల 15 నిమిషాల్లో రైలు (09:45 నుండి 21:00 వరకు)
సికింద్రాబాద్ నుంచి ముంబైకి 11 గంటల 20 నిమిషాల్లో (22:25 నుండి 09:45 వరకు) రైలు
ముంబై నుంచి సికింద్రాబాద్ వరకు 11 గంటల 45 నిమిషాల్లో రైలు (23:35 నుండి 11:20 వరకు)
ముంబై నుంచి ఔరంగాబాద్‌కు 6 గంటల్లో రైలు (15:45 నుండి 21:45 వరకు)
ఔరంగాబాద్ నుంచి ముంబైకి 6 గంటల 10 నిమిషాల్లో రైలు (06:15 నుండి 12:25)
విశాఖపట్నం నుంచి విజయవాడకు 6 గంటల 05 నిమిషాల్లో రైలు (08:40 నుండి 14:45 వరకు)
విజయవాడ నుండి విశాఖపట్నం వరకు 6 గంటల 05 నిమిషాల్లో రైలు (16:00 నుండి 22:05)
విశాఖపట్నం నుండి బెంగళూరుకు రేణుగుంత మీదుగా 16 గంటల 45 నిమిషాల్లో రైలు (19:45 నుండి 12:30 వరకు)
బెంగళూరు నుండి విశాఖపట్నం వరకు 17 గంటల 55 నిమిషాల్లో రైలు (18:00 నుండి 11:55 వరకు)
హౌరా నుండి సికింద్రాబాద్‌కు 25 గంటల 20 నిమిషాల్లో (18:40 నుండి 20:00 వరకు) రైలు
సికింద్రాబాద్ నుండి హౌరాకు 25 గంటల 30 నిమిషాల్లో (05:00 నుండి 06:30 వరకు) రైలు