Airports Privatization : దేశంలో మరో 13 ఎయిర్‌పోర్టులు ప్రైవేటీకరణ..?

దేశంలోని 13 ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి.. వచ్చే ఏడాది మార్చ్‌లోపు ఈ ప్రక్రియను ముగించాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌ ఇండియా డెడ్‌లైన్ పెట్టుకుంది.

Airports Privatization : దేశంలో మరో 13 ఎయిర్‌పోర్టులు ప్రైవేటీకరణ..?

Privatization

airports Privatization in india : దేశంలోని 13 ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి.. వచ్చే ఏడాది మార్చ్‌లోపు ఈ ప్రక్రియను ముగించాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌ ఇండియా డెడ్‌లైన్ పెట్టుకుంది.. భారీ ఎత్తున నిధుల సమీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల మానిటైజేషన్ ప్రణాళికను ప్రకటించింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది వరకు 13 ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరించేందుకు నిర్ణయం తీసుకుంది… ఇందులో ఆరు పెద్ద విమానాశ్రయాలు, ఏడు చిన్నవి ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన లిస్ట్‌ను కేంద్ర విమానాయాన శాఖకు పంపామని.. ఎయిర్‌పోర్ట్ అథారిటీ చైర్మన్‌ సంజీవ్‌ కుమార్‌ తెలిపారు..

ఆరు పెద్ద విమనాశ్రయాల్లో అమృత్‌సర్, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, తిరుచ్చి, వారణాసి ఉండగా, ఏడు చిన్న విమానాశ్రయాల్లో హుబ్లి, తిరుపతి, ఔరంగాబాద్, జబల్‌పూర్, కంగ్రా, కుషినగర్, గయ ఉన్నాయి. చిన్న విమానాశ్రయాలను, పెద్ద విమానాశ్రయాలతో క్లబ్ చేయడం ద్వారా… బిడ్డింగ్ ప్రాసెస్ నిర్వహిస్తున్నారు. వారణాసి విమానాశ్రయంలో కుషినగర్, గయను కలిపేయనుండగా, అమృత్‌సర్‌లో కంగ్రాను, భువనేశ్వర్‌ను తిరుపతితో, రాయ్‌పూర్‌ను ఔరంగాబాద్‌తోను, ఇండోర్‌ను జబల్‌పూర్‌తోను, తిరుచ్చిని హుబ్లీతో కలిపి బిడ్డింగ్ ప్రాసెస్ నిర్వహిస్తారు.

AP Government : టీటీడీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఇలా కలిపేసిన విమానాశ్రాయల కలిపేసి పబ్లిక్‌ ప్రైవేట్ పార్టనర్‌షిప్‌ మోడ్‌లో బిడ్‌లను ఆహ్వానించనున్నారు.. పర్ ప్యాసింజర్ రెవెన్యూ మోడ్‌లో బిడ్‌లను ఆహ్వానిస్తానమి ఏఏఐ ప్రకటించింది.. 50 ఏళ్ల పాటు ఈ కాంట్రాక్ట్ ఉండనుందని తెలుస్తోంది.. కోవిడ్ దెబ్బతో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది.. ఏ ఏడాదిలో ఇప్పటి వరకు 19 వందల 62 కోట్ల నష్టాలను చవిచూసింది. మెయింటనెన్స్‌, జీతాల చెల్లింపు కోసం ఇప్పటికే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి 15 వందల కోట్ల రుణాన్ని తీసుకుంది.. భవిష్యత్తులో మరింత రుణం తీసుకుంటే కానీ ఎయిర్‌పోర్టుల మెయింటనెన్స్‌ సాధ్యం కాదన్న ఆలోచనలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఉంది.