Raihan Vadra : వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ గా ప్రియాంకా గాంధీ కుమారుడు..ఎగ్జిబిషన్ ఏర్పాటు

ప్రియాంకా గాంధీ,రాబర్ల్ వాద్రాల ముద్దుల కుమారుడు రైహాన్ వాద్రా వైల్డ్ లైఫ్ ఫోటో గ్రఫీ ఎగ్జిబిషన్ ఏర్పాటైంది. 20 ఏళ్ల రైహాన్ వాద్రా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీలో విశేష ప్రతిభ కనబరుస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో తాను తీసిన ఫోటోలతో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు.

Raihan Vadra : వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ గా ప్రియాంకా గాంధీ కుమారుడు..ఎగ్జిబిషన్ ఏర్పాటు

Priyanka Son Raihan Vadra Photography (1)

Priyanka son Raihan Vadra photography : ప్రియాంక గాంధీ. పరిచయం అవసరం లేని మహిళ. రాబర్ట్ వాద్రాను వివాహం చేసుకున్న ప్రియాంకా గాంధీ ముద్దుల తనయుడు రైహాన్ రాజీవ్ వాద్రా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీలో రాణిస్తున్నాడు. చూడచక్కని ఫోటోలు తీస్తు తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. రైహాన వాద్రాకు ఫోటో గ్రఫీ అంటూ ప్రాణం. 10ఏళ్ల వయసు నుంచే కెమెరాపై ఇష్టం పెంచుకున్నాడు. అడవులు, జంతువులంటే చాలా ఇష్టం.అక్కడ ఉండే జీవజాతుల్ని తన కెమెరాలో బంధించటం అంటే ఇంకా ఇష్టం. అలా వైల్డ్ లైఫ్ ఫోటో గ్రఫీలో రాణిస్తున్నాడు. రైహాన్ తీసిన ఫొటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటైంది. భవిష్యత్తులోనూ ఫొటోగ్రఫీ కొనసాగిస్తానని అంటున్నాడు ప్రియాంకా, రాబర్ట్ వాద్రాల ముద్దుల తనయుడు రైహాన రాజీవ్ వాద్రా.

అలా అడవుల్లో విభిన్నమైన ఫోటోలు తీస్తూ రైహాన్ రాజీవ్ వాద్రా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీలో విశేష ప్రతిభ కనబరుస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. రైహాన్ వాద్రా వయసు ఇప్పుడు 20 ఏళ్లు. పదేళ్ల వయసు నుంచే కెమెరాతో చెలిమి చేసిన ఈ సెలబ్రిటీ సన్ కు తల్లి ప్రియాంకనే తొలి గురువట. ప్రియాంకా ఫోటోలు తీయటంలో స్పెషలిస్టులు.అలా తల్లి నుంచి ఫొటోగ్రఫీ మెళకువలు తెలుసుకున్న రైహాన్ అడవులను సందర్శిస్తూ, అక్కడి ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ..వైల్డ లైఫ్ ఫోటో గ్రఫీలో ఎన్నో జీవజాతులను, జంతువులను ఫొటోలు తీస్తూ మెప్పిస్తున్నాడు.

ఇప్పుడు రైహాన్ తీసిన వైల్డ్ లైఫ్ ఫొటోలతో ఓ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటైంది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అనేది తన జీవిత లక్ష్యమంటున్నాడీ జూనియర్ వాద్రా. ప్రజలతో మమేకం అయ్యేందుకు ఇదొక అద్భుతమైన సాధనం అంటున్నాడీ కుర్రాడు. తన తల్లిది పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి చాలామంది పొలిటిల్ ఎంట్రీ గురించి అడుగుతుంటారని కానీ తన దృష్టి అంతా ఇప్పుడు ఫొటోగ్రఫీ మీదే ఉంది అంటున్నాడు రైహాన్ రాజీవ్ వాద్రా.

కాగా రైహాన్ వాద్రా గతంలో తీసిన ఎన్నో ఫోటోలు ఎంతోమందితో ప్రశంసలు పొందాయి. తను తీసిన ఫోటోలను తన ఇన్ స్టాలో పోస్టు చేస్తుంటాడు రైహాన్. అలా రణతంబోర్ నేషనల్ పార్క్ లో 2020లో ఆకు పచ్చని పొదల్లో ఉన్న పెద్దపులి కన్ను ఫోటోలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఢిల్లీ, డెహ్రాడూన్, లండన్ లో చదువుకున్న రైహాన్ వాద్రా వైల్డ్ లైఫ్ ఫోటో గ్రఫీలో తీసిన ఫోటోలతో ఓ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటైంది.