Priyanka Chopra : ప్లీజ్..‌ ఇంట్లోనే ఉండండి.. కచ్చితంగా పెట్టుకోండి.. దేశ ప్రజలకు ప్రముఖ హీరోయిన్ విజ్ఞప్తి

దేశంలో కరోనా మహమ్మారి అడ్డూఅదుపు లేకుండా చెలరేగిపోతోంది. ఈ వైరస్ సృష్టిస్తున్న ప్రళయానికి యావత్‌ భారతావని వణికిపోతోంది. సెకండ్ వేవ్‌లో రెట్టింపు వేగంతో విస్తరిస్తున్న కరోనా దాటికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజులకు లక్షల్లో పాజిటివ్‌ కేసులు

Priyanka Chopra : ప్లీజ్..‌ ఇంట్లోనే ఉండండి.. కచ్చితంగా పెట్టుకోండి.. దేశ ప్రజలకు ప్రముఖ హీరోయిన్ విజ్ఞప్తి

Priyanka Chopra

Priyanka Chopra : దేశంలో కరోనా మహమ్మారి అడ్డూఅదుపు లేకుండా చెలరేగిపోతోంది. ఈ వైరస్ సృష్టిస్తున్న ప్రళయానికి యావత్‌ భారతావని వణికిపోతోంది. సెకండ్ వేవ్‌లో రెట్టింపు వేగంతో విస్తరిస్తున్న కరోనా దాటికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజులకు లక్షల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ని ప్రకటించగా, మరికొన్ని కర్ప్యూ విధించాయి. అయినప్పటికీ కోవిడ్ విజృంభణ కొనసాతూనే ఉంది.

ఈ నేపథ్యంలో పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు ప్రజలను అప్రమత్తం చేసే బాధ్యతను తీసుకున్నారు. సోషల్‌ మీడియా వేదికగా జాగ్రత్తలు చెబుతున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్, గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇలాంటి రిక్వెస్టే చేశారు. దేశంలో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయని, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని ఆమె విజ్ఞప్తి చేసింది. తప్పని సరిగా అందరూ మాస్కులు ధరించాలని కోరింది.

‘మీ కోసం, మీ ఫ్యామిలీ కోసం, స్నేహితుల కోసం, ఫ్రంట్‌లైన్‌ వారియర్ల కోసం మీరంతా ఇంట్లోనే ఉండండి. అత్యవసరం అయితేనే బయటకు రండి. బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించండి. ప్లీజ్‌.. పరిస్థితిని అర్థం చేసుకోండి. మీ వంతు వచ్చినప్పుడు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ తీసుకోండి. మనం తీసుకునే ఈ జాగ్రత్తలే వైద్య రంగంపై ఒత్తిడి తగ్గిస్తాయి’ అని ప్రియాంక చోప్రా తెలిపింది.

దేశంలో కరోనా ప్రళయం:
దేశంలో కరోనా మహమ్మారి ప్రళయం సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలో నమోదవుతున్నాయి. తాజాగా ఒక్కరోజే దాదాపు 3లక్షల మంది కరోనా బారిన పడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2.95లక్షల కేసులు నమోదయ్యాయి. కరోనా దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అదే సమయంలో 2వేల 023 మందిని కరోనా బలి తీసుకుంది. దేశంలో రోజువారీ మరణాలు 2వేలు దాటడం కూడా ఇదే తొలిసారి. మంగళవారం(ఏప్రిల్ 20,2021) ఉదయం 8 గంటల నుంచి బుధవారం(ఏప్రిల్ 21,2021) ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 16,39,357 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 2లక్షల 95వేల 041 మందికి పాజిటివ్‌ అని తేలింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,56,16,130కి చేరింది.

ఇదే సమయంలో కొవిడ్‌తో 2023 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 1,82,553కి చేరింది. మరణాల రేటు 1.18శాతంగా కొనసాగుతోంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21,57,538కి చేరింది.