ప్రియాంక చాలా అందంగా ఉంటుంది కానీ..

  • Published By: venkaiahnaidu ,Published On : January 25, 2019 / 10:21 AM IST
ప్రియాంక చాలా అందంగా ఉంటుంది కానీ..

ప్రియాంక గాంధీపై  బీహార్ మంత్రి వినోద్ నారయణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ చాలా అందంగా ఉంటుందని,ఆమెకు అసలు ఎటువంటి రాజకీయ పరిజ్ణానం లేదని,అందమైన ముఖాలు చూసి ప్రజలు ఓట్లు వేయరని అన్నారు. అంతేకాకుండా ఆమె   ల్యాండ్ స్కామ్, ఇతర అనేక అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్న రాబర్ట్ వాద్రా భర్య అని  శుక్రవారం(జనవరి 25,2019) వినోద్ నారాయణ్ అన్నారు.  

కొన్నేళ్లుగా అమేథీ, రాయబరేలీ ప్రచారానికే పరిమితమైన ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ లోని తూర్పు ప్రాంతానికి పార్టీ జనరల్ సెక్రటరీగా బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ నియమించిన విషయం తెలిసిందే. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీలకు సాక్ ఇచ్చేలా రాహుల్ నిర్ణయం ఉందని, దేశవ్యాప్తంగా ప్రియాంకగాంధీ కాంగ్రెస్ కు నూతనుత్తేజం తీసుకొస్తుందని కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకొంటున్న సమయంలో అసలు ప్రియాంక గాంధీ వల్ల బీజేపీకి ఎటువంటి నష్టం లేదని మోడీ వంటి నేతలు అంటున్నారు.

కాంగ్రెస్ ది కుటుంబ పార్టీ అని మోడీ ఆరోపించారు. మరోవైపు ప్రియాంక బాధ్యతలు చేపట్టిన తూర్పు ప్రాంతంలోనే ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి వంటి కీలక నియోజకవర్గాలున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న శివసేన  ప్రియాంక గాంధీకి మద్దతుగా నిలిచింది. ప్రియాంక రాకతో హిందీ బెల్ట్ లో కాంగ్రెస్ కు పునర్వైభవం వస్తుందని తన అధికార పత్రిక సమ్నాలో శివసేన ఓ కథనం ప్రచురించింది.