ప్రజలు ఫూల్స్ కాదు...మోడీ విమర్శలకు ప్రియాంక కౌంటర్

ప్రజలు ఫూల్స్ కాదు…మోడీ విమర్శలకు ప్రియాంక కౌంటర్

ప్రజలు ఫూల్స్ కాదు…మోడీ విమర్శలకు ప్రియాంక కౌంటర్

ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ చేపట్టిన గంగాయాత్ర బుధవారం(మార్చి-20,2019) ముగిసింది.140 కిలోమీటర్ల పాటు ఆమె పడవలో ప్రయాణించారు.ప్రయాగ్ రాజ్ లో పూజల అనంతరం ప్రారంభమై మూడు రోజులపాటు గంగా పరీవాహక ప్రాంతాల ప్రజలతో ముచ్చటిస్తూ వారణాశి వరకు యాత్ర కొనసాగింది.వారణాశి చేరుకున్న అనంతరం కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రియాంకా పూజలు చేశారు.ఆమెతో పాటు పార్టీ నాయకులు అఖిలేశ్‌ ప్రతాప్‌ సింగ్‌, అరాధన మిశ్రా, సావిత్రి భాయ్‌ పూలే తదితరులు ఉన్నారు.అనంతరం పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన కుమార్ యాదవ్ నివాసానికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చి వారిని ఓదార్చారు.ఆ తర్వాత ఇటీవల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని బుడ్గామ్ జిల్లాలో వాయుసేనకు చెందిన ఎమ్ఐ-17హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన వాయుసేన పైలట్ విశాల్ కుమార్ ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను ప్రియాంక ఓదార్చారు. వారణాశిలో పర్యటన సందర్భంగా ప్రధాని పై ప్రియాంక తీవ్ర విమర్శలు చేవారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వాలను విమర్శిస్తూ…కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు చేస్తోందని,కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండదని, ప్రధాని మోడీ బుధవారం తన బ్లాగ్ లో పోస్ట్ చేశారు.మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ప్రియాంక ప్రజలు ఫూల్స్ అనుకుంటున్న మోడీ ఆ ఆలోచన వీడాలని సూచించారు.గడిచిన ఐదేళ్లుగా వ్యవస్థలపై మోడీ సర్కార్ దాడి చేసిందని విమర్శించారు.ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు.మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుతుందో అని కొందరు భయపడుతున్నారని,తమకు మాత్రం అటువంటి భయం లేదన్నారు.బీజేపీ తమ వేధింపులకు గురిచేసినా సరే తాము ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని ఆమె అన్నారు.

×