స్ప్రింటర్‌గా మారిన ప్రియాంక గాంధీ.. సభకు లేట్ అవుతుందని పరుగులతో

స్ప్రింటర్‌గా మారిన ప్రియాంక గాంధీ.. సభకు లేట్ అవుతుందని పరుగులతో

Priyanka Gandhi, Late To A Rally In Assam

Priyanka Gandhi: కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ పరుగులు పెట్టారు. అస్సాంలో మంగళవారం బహిరంగ సభకు హాజరుకావాల్సి ఉండగా కాస్త ఆలస్యమైంది. ఆ సమయాన్ని కవర్ చేసేందుకు పరిగెత్తుకుంటూ వచ్చారు. చుట్టూ బాడీగార్డులతో డార్క్ మెరూన్ శారీలో మట్టిలో పరుగులు పెడుతూ ఉన్న వీడియోను కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

ఆమెకు ఇరువైపులా జనం నిల్చొని చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. చేతులు జోడించి నమస్తే చెబుతూ.. వేదికకు చేరుకున్నారు. అస్సాంలో ప్రియాంక బిజీ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు.

వెనుక బుట్ట తగిలించుకుని అస్సాం టీ వర్కర్లతో మాట్లాడారు. కాసేపు వారితో కలిసి పనిచేశారు. జూమూర్, ఫోక్ డ్యాన్స్ లను ఆ బృందంతో కలిసి చేసేందుకు ట్రై చేశారు. వారంతా కలిసి ఆమెకు ఎర్ర అంచు ఉన్న తెల్ల చీరను బహుకరించారు. అక్కడ డ్యాన్స్ చేసేటప్పుడు అది ధరించడం ఆనవాయితీ అంట.

రెండు నెలలుగా 3లక్షలకు పైగా రైతులు ధర్నాలో కూర్చుంటున్నారు. ప్రధాని ఉండే ప్రాంతానికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటున్నారు. కానీ, అతనికి వారిని కలవడం కుదరడం లేదు. ఒకసారి వెళ్లి కలిస్తే సమస్యేంటి. చట్టాల వల్ల వారికి ఉన్న సమస్య గురించి చర్చిస్తే బాగుంటుంది కదా. అప్పడు వారికి బెనిఫిట్ వచ్చేలాగే మార్పులు చేస్తే సరిపోతుంది. కానీ, చట్టాలు, పాలసీలు ధనికుల కోసమే అన్నట్లుగా చేస్తుంది ఈ ప్రభుత్వం’ అని ప్రియాంక వెల్లడించారు.

ప్రధాని నరేంద్ర మోడీ బ్రాండింగ్ చెప్పుకుని డెవలప్‌మెంట్ పాలసీలు ఏమీ లేకుండానే గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ తో పాటు మిత్రపక్ష పార్టీలు అన్నీ కలిసి హక్కులు, సీఏఏ, ఎన్నార్సీ లాంటి అంశాలపై అస్సాంలో ప్రచారం చేపడుతున్నాయి. మార్చి, ఏప్రిల్లో మూడు విభిన్నమైన రోజులలో ఎన్నికల నిర్వహించనున్నారు. అస్సాంలో 126అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.