వాద్రాకు భయమేస్తుంది: ప్రియాంక గాంధీ సెక్యూరిటీ లేదు.. కూతురికి ఏమవుతుందో..

వాద్రాకు భయమేస్తుంది: ప్రియాంక గాంధీ సెక్యూరిటీ లేదు.. కూతురికి ఏమవుతుందో..

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీకు సెక్యూరిటీ తొలగించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో రాబర్ట్ వాద్రాకు భయమేస్తుందట. మోడీ ప్రభుత్వం గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న తర్వాత.. ప్రియాంక గాంధీ భర్త అయిన వాద్రాకు తన పిల్లల విషయంలో భయమేస్తుందట.

 

‘ఎస్పీజీ తొలిగించినందుకు ప్రియాంక గాంధీ ఒక్కరి గురించే కాదు. నా కూతురు, కొడుకు, గాంధీ కుటుంబానికి చెందిన వారికి ఏమవుతుందోనని భయంగా ఉంది. దేశవ్యాప్తంగా బాలికల సెక్యూరిటీ కరువైంది. ప్రతి పౌరుని భద్రత ప్రభుత్వం బాధ్యతే. స్వదేశంలో భద్రత లోపిస్తే, ఇళ్లలో, రోడ్లపై, పగలూ రాత్రి రక్షణ లేకుండా పోతే, మనం ఎప్పుడు, ఎక్కడ సురక్షితంగా బతకగలం?’ అని ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. 

 

రాజ్యసభలో మంగళవారం సెక్యూరిటీ గురించి హోం మంత్రి అమిత్ షా చర్చించారు. ఢిల్లీలో ప్రియాంక గాంధీ ఇంట్లోకి ఓ కారు దూసుకెళ్లింది. సమీపంలో ఉన్న భద్రతా వ్యవస్థను దాటుకొని లోపలికి వెళ్లింది. మహిళతో పాటు మరో నలుగురు కారులో ఉన్నారు. నవంబరు 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

 

అత్యంత భద్రత ఉండే ప్రియాంక గాంధీ ఇంట్లోకి భద్రతా వ్యవస్థ కళ్లు గప్పి ఐదుగురు వ్యక్తులు వచ్చారు. ఎలాంటి ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండానే  వారంతా ఆమెను కలిసినట్లు తెలుస్తోంది. సెల్ఫీ కోసమే వారు ఈ ప్రయత్నం చేసినట్లు సమాచారం.