Miraya Birthday : పిల్లలు త్వరగా ఎందుకు పెరుగుతారు ? ప్రియాంక వీడియో పోస్ట్

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ...రాజకీయాల్లో పాల్గొంటూనే సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. పలు వీడియోలను, అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. తాజాగా...తన పిల్లలు రెహన్ రాజీవ్ వాద్రా, కుమార్తె మిరాయ వాద్రాతో కలిసి ఓ వీడియోను ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు.

Miraya Birthday : పిల్లలు త్వరగా ఎందుకు పెరుగుతారు ? ప్రియాంక వీడియో పోస్ట్

Priyanka

Priyanka Gandhi : పిల్లలు అంత త్వరగా ఎందుకు పెరుగుతారు ? అంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ…ఆమె ఈ ప్రత్యేకమైన వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకొంటోంది. ఈ వీడియోను షేర్ చేయడమే కాకుండా..పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ఆ వీడియో ఏంటనేగా మీ డౌట్.

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ…రాజకీయాల్లో పాల్గొంటూనే సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. పలు వీడియోలను, అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. తాజాగా…తన పిల్లలు రెహన్ రాజీవ్ వాద్రా, కుమార్తె మిరాయ వాద్రాతో కలిసి ఓ వీడియోను ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆమె పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 2021, జూన్ 25వ తేదీ కుమార్తె మిరాయ జన్మదినం. మిరాయకు 19 ఏళ్లు వచ్చాయి..ఈ సందర్భంగా..ప్రియాంక తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశారు.

ఇందులో మిరాయ పుట్టినప్పటి వీడియో అని తెలుస్తోంది. ఆసుపత్రిలో చిత్రీకరించిన ఈ వీడియోలో మంచం మీద తెల్లనివస్త్రంతో చిన్నారిని చుట్టి ఉంది. కుమారుడు రెహాన్ మంచి కుడివైపున పడుకున్నాడు. రెహాన్ తో ప్రియాంక మాట్లాడుతున్నారు. ఈ వీడియోతో పాటు ప్రియాంక గాంధీ..తన కుమార్తె ఫొటోను కూడా షేర్ చేశారు. ఎందుకు అంత వేగంగా..పెరుగుతారు ? అని తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Gandhi Vadra (@priyankagandhivadra)