నకిలీ గాంధీ : ప్రియాంకా గాంధీ పేరును ‘ఫిరోజ్ ప్రియాంకా’గా మార్చుకోవాలి: బీజేపీ నేత సాధ్వీ

  • Published By: veegamteam ,Published On : December 31, 2019 / 10:18 AM IST
నకిలీ గాంధీ : ప్రియాంకా గాంధీ పేరును ‘ఫిరోజ్ ప్రియాంకా’గా మార్చుకోవాలి: బీజేపీ నేత సాధ్వీ

ప్రియాంకా గాంధీ తన పేరును ఫిరోజ్ ప్రియాంకాగా మార్చుకోవాలని కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సూచించారు.  హిందూ ధర్మమంటే శాంతికి ప్రతిరూపమని, అటువంటిది కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తి ప్రతీకారం అంటూ వ్యాఖ్యలు చేయడమేంటని ప్రియాంకా గాంధీ సీఎం యోగిపై చేసిన విమర్శలపై మంత్రి సాధ్వి నిరంజన్ తీవ్రంగా మండిపడ్డారు. ఆమె  ప్రియాంకా గాంధీ కాదు నకిలీ గాంధీ..అనీ అటువంటి ఆమెకు కాషాయ రంగు గురించి ఏం తెలుస్తుంది అంటూ ఎద్దేవా చేశారు. 

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ యోగి ఆదిత్యనాథ్ అనటాన్ని ప్రియాంకా తప్పు పట్టారు. భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటామనడం ఇదే తొలిసారని అన్నారు. దీనిపై సాధ్వీ మాట్లాడుతూ..సీఏఏను వ్యతరేకించేవారు నేరస్థులేననీ..యూపీలోని నేరస్థులపై సీఎం యోగీ ఆదిత్యానాథ్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. అది ప్రియాంకాకు నచ్చటంలేదు అంటూ  ఆరోపించారు.

మరి యూపీలో జరుగుతున్న అల్లర్ల వెనుక ప్రియాంకా హస్తం ఉందేమో అందుకే ఆమె సీఎం వ్యాఖ్యలకు ఉలికిపడుతున్నారంటూ ఆరోపించారు.  నకిలీ పేరుతో చలామణీ అయ్యేవారే ఇటువంటి పనులు చేస్తారనీ..అమాయకులపై దాడి చేసి..పోలీసులపై రాళ్ల దాడి చేసినవారిని ప్రియాంకా సమర్థించటంపై ఈ అల్లర్లకు కారణం ఆమే అనుకోవచ్చు అనేలా ఆమె వ్యవహరిస్తున్నారని అన్నారు.సీఏఏని వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులను ప్రియాంకా రెచ్చగొడుతున్నారనీ..విమర్శించారు.  
  
సీఎం యోగీ ఆదిత్యానాథ్ కాషాయ వస్త్రాలు ధరించటం ఆయన వ్యక్తిగతం కాదు..కాషాయ రంగు అంటే కుంకుమ అని అర్థం ఆ రంగుకు అర్థం ఆధ్యాత్మికత స్ఫూర్తికి ప్రతిరూపం అన్నారు. అది హిందూ మతానికి ప్రతీక అనీ ఇటువంటి విషయాలు నకిలీ పేరుతో చలామణీ అయ్యేవారికి ఎలా తెలుస్తుంది? అంటూ కేంద్రమంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి ప్రియాంకాగాంధీపై తీవ్ర విమర్శలు చేశారు.