Priyanka Gandhi : బీజేపీ నేతలు,వారి బిలియనీర్ ఫ్రెండ్స్ కే భారత్ లో భద్రత

ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఆదివారం నిర్వహించిన ‘కిసాన్ న్యాయ్’ ర్యాలీలో పాల్గొన్న ప్రియాంకగాంధీ

Priyanka Gandhi : బీజేపీ నేతలు,వారి బిలియనీర్ ఫ్రెండ్స్ కే భారత్ లో భద్రత

Congress2

Priyanka Gandhi     ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఆదివారం నిర్వహించిన ‘కిసాన్ న్యాయ్’ ర్యాలీలో పాల్గొన్న ప్రియాంకగాంధీ..తన ప్రసంగాన్ని శ్లోకాలతో ప్రారంభించారు. ఈ రోజు నవరాత్రులలో నాల్గవ రోజు.. నేను ఈ రోజు ఉపవాసం పాటిస్తున్నాను.. నేను మాత స్తుతితో మొదలుపెట్టాలనుకుంటున్నాను.. ఇది నవరాత్రుల సమయం కాబట్టి నా హృదయంతో మాట్లాడాలని అనుకున్నాను అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు ప్రియాంకగాంధీ.

ప్రియాంక గాంధీ గాంధీ మాట్లాడుతూ.. లఖింపూర్ లో ఇంతటి దుర్ఘటన జరిగిన తర్వాత కూడా మోదీ లక్నో వచ్చివెళ్లారేగానీ..లఖింపూర్‌ ఖేరీలో బాధిత రైతులను ఎందుకు పరామర్శించలేదని ఆమె ప్రశ్నించారు. కేంద్రం తెచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదికిపైగా నిరసన చేస్తున్నా వారితో మాట్లాడేందుకు మోదీకి సమయం లేదని ప్రియాంక గాంధీ విమర్శించారు.

ఇటీవల యూపీలోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో రైతులపై హత్యాకాండకు పాల్పడిన కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రాను యోగి ప్రభుత్వం కాపడుతోందని ఆరోపించిన ప్రియాంక.. రైతులకు న్యాయం జరిగేవరకు తాను, కాంగ్రెస్ పోరాడుతామని, జైల్లో పెట్టి కొట్టినా సరే పోరాటం ఆపబోమన్నారు. లఖింపూర్ కేసు విచారణ సాఫీగా సాగాలంటే అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

అధికారంలో ఉన్న బీజేపీ నేతలు, వారి కార్పొరేట్ మిత్రులలకు తప్ప దేశంలో మిగతావాళ్లెవరికీ భద్రత లేదని ప్రియాంక గాంధీ అన్నారు. ఈ దేశం మోదీ లేదా ఏ కొందరిదో కాదన్న నిజాన్ని గుర్తెరిగి అధికార మార్పు కోసం ప్రజలంతా పోరాటానికి సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. దేశంలో ఒక వైపు ద్రవ్యోల్బణం, మరోవైపు నిరుద్యోగ సమస్య పెరుగుతుందని ప్రియాంకగాంధీ ఆరోపించారు. ఈ సమస్యల కారణంగా ప్రజలు ప్రభుత్వంపై కోపంతో ఉన్నారని, కలత చెందుతున్నారని అన్నారు. ప్రజలు తమ ఉద్యోగాలు కోల్పోతున్నప్పటికీ, చిన్న వ్యాపారాలు మూతపడుతున్నప్పటికీ ప్రధాని మోదీ ధనిక స్నేహితులు బిలియన్ల కొద్దీ డబ్బు సంపాదిస్తున్నారని మండిపడ్డారు.

దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతోంటే మోదీ మాత్రం తనకోసం ప్రత్యేకంగా వందల కోట్లతో విమానాలు చేయించుకున్నారని, ఇది చాలదన్నట్లు ప్రభుత్వరంగ సంస్థలను ఎడాపెడా అమ్మేస్తున్నారని ప్రియాంక మండిపడ్డారు.

ALSO READ  ఫేస్‌బుక్‌లో ఆ ఫోటో పోస్ట్ చేశాడు.. చివరకు కటకటాలపాలయ్యాడు

ALSO READ  లఖింపూర్ ఘటనపై రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరిన కాంగ్రెస్