అమ్మబాబోయ్ : పాములతో ఆటలాడిన ప్రియాంక గాంధీ

మరో పాము అయితే ప్రియాంక కాళ్ల దగ్గర పడగ విప్పి ఉంది.  దీంతో అందరూ షాక్ అయ్యారు. సెక్యూరిటీ సిబ్బందికి సైతం చెమటలు పట్టాయి. ఏ మాత్రం బెరకు లేకుండా ఉన్నారు. పాములను తన చేతితో పట్టుకునే.

  • Published By: veegamteam ,Published On : May 2, 2019 / 07:19 AM IST
అమ్మబాబోయ్ : పాములతో ఆటలాడిన ప్రియాంక గాంధీ

మరో పాము అయితే ప్రియాంక కాళ్ల దగ్గర పడగ విప్పి ఉంది.  దీంతో అందరూ షాక్ అయ్యారు. సెక్యూరిటీ సిబ్బందికి సైతం చెమటలు పట్టాయి. ఏ మాత్రం బెరకు లేకుండా ఉన్నారు. పాములను తన చేతితో పట్టుకునే.

పాము.. పేరు వింటేనే అమ్మో అంటాం.. కనిపిస్తే గంతులే. పరుగో పరుగు. మనకు ఉండే ఫీలింగ్ ఇది. ఇక పెద్దలు, ప్రముఖుల విషయంలో అయితే వారు నివసించే ప్రాంతాలు, పెరిగే వాతావరణం చూస్తే పాములను కేవలం జూలోనే చూస్తారు అనుకుంటాం. ఇలాంటి పాముల అంశంలో.. ప్రియాంక గాంధీ విషయానికి వస్తే ఇప్పుడు అందరూ నోరెళ్లబెడుతున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయబరేలి నియోజకవర్గంలో మే 2వ తేదీన ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ప్రధాన వీధిలో పాములు ఆడించే వాళ్లు కనిపించారు. వారి దగ్గరకు వెళ్లి ముచ్చటించారు. వారి బాధలు చెప్పుకున్నారు. ఈ సందర్భంలోనే మీరు పాములను ఎలా ఆడిస్తారు అంటూ ప్రశ్నించారు ప్రియాంక గాంధీ వాద్రా. దీనికి వారు తమ బుట్టల్లోని పాములను తీసి చూపించారు. 
Also Read : వర్మ పంతం నెగ్గింది: ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలైంది.. కానీ!

బుట్టలో నుంచి పాములు బయటకు రాగానే మిగతా వారు అందరూ అమ్మో అంటూ దూరం జరిగారు. ఆశ్చర్యంగా ప్రియాంక గాంధీ ఆ పాములను పట్టుకుని చూశారు. ఇలాగేనా పాములను ఆడించేది అంటూ వాటిని చేతుల్లోకి తీసుకున్నారు. బుట్టలోని ఓ పామును అయితే పట్టుకుని బయటకు తీశారు. మరో పామును చేతిలోనే కొద్దిసేపు ఉంచుకున్నారు. మరో పాము అయితే ప్రియాంక కాళ్ల దగ్గర పడగ విప్పి ఉంది.  

దీంతో అందరూ షాక్ అయ్యారు. సెక్యూరిటీ సిబ్బందికి సైతం చెమటలు పట్టాయి. ఏ మాత్రం బెరకు లేకుండా ఉన్నారు. పాములను తన చేతితో పట్టుకునే.. వారితో మాట్లాడారు. 10 నిమిషాలపాటు పాములను ఆడించే వారి నుంచి వారి బాధలు అడిగి తెలుసుకున్నారు ప్రియాంక. చివరగా తన కాళ్ల దగ్గర పడగ విప్పి ఉన్న పామును తన చేతులతోనే బుట్టలో పెట్టేశారు. ప్రియాంక గాంధీ వాద్రా పాములతో ఆటలాడటం, వాటిని స్వయంగా చేతులతో పట్టుకుని ఆడించటం ఆసక్తికరంగా మారింది.
Also Read : పట్టపగలు.. నడిరోడ్డుపై : హైదరాబాద్ సిటీ బస్సులో కాల్పులు