Priyanka Gandhi : ప్రియాంక కాన్వాయ్ ని మరోసారి అడ్డుకున్న యూపీ పోలీసులు

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని, ఆమె కాన్వాయ్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. ఒక దొంగతనం కేసులో పట్టుబడి పోలీసు కస్టడీలో మరణించిన పారిశుద్ధ్య కార్మికుడి

Priyanka Gandhi : ప్రియాంక కాన్వాయ్ ని మరోసారి అడ్డుకున్న యూపీ పోలీసులు

Up2

Priyanka Gandhi  కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని, ఆమె కాన్వాయ్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. ఒక దొంగతనం కేసులో పట్టుబడి పోలీసు కస్టడీలో మరణించిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ బుధవారం లక్నో నుంచి బుధవారం ఆగ్రా బయల్దేరారు.

లక్నో నుంచి ఆగ్రా వెళ్తున్న ప్రియాంకగాంధీని లక్నో-ఆగ్రా ఎక్స్ ప్రెస్ వే మీద పోలీసులు అడ్డగించారు. రోడ్డును బ్లాక్ చేసిన పోలీసులు..ప్రియాంక పర్యటనకు అనుమతి లేదని, ముందుకు వెళ్లనిచ్చేది లేదని చెప్పడంతో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసింది. దీంతో ప్రియాంక తిరిగి కారులోకి వెళ్లి కూర్చున్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే నవంబర్ 8 వరకు రానున్న పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని లక్నోలో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంకను అడ్డుకున్నట్లు తెలిపారు. సెక్షన్ 144..నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల సమావేశాన్ని నిషేధించడానికి మేజిస్ట్రేట్‌కు అధికారం ఇస్తుంది.

కాగా, యూపీ పోలీసులు తనను ఎక్కపడితే అక్కడ అడ్డుకుంటున్నారంటూ మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక మండిపడ్డారు. పోలీసులు తనను ఆగ్రా వెళ్లకూడదు అని అంటున్నారు. నేను ఎక్కడికి వెళ్లినా ఆపేస్తున్నారు. బీజేపీ రాజకీయంగా బాగుండటం కోసం తాను రెస్టారెంట్లలో కూర్చుండిపోవాలా అని ప్రియాంక ప్రశ్నించారు. తాను బాధిత కుటుంబాన్ని కలుసుకోవాలనుకుంటున్నాను. ఇందులో ఏముంది అని ప్రియాంక ప్రశ్నించారు.

బీజేపీ ప్రభుత్వంలో.. న్యాయం కోరడం, ఎవరికైనా ఓదార్చడం నేరం అయితే మేము ఈ నేరం చేస్తూనే ఉంటాం … న్యాయం కోసం మేం స్వరం పెంచుతూనే ఉంటాం అని ప్రియాంకగాంధీ అన్నారు. ఇక,బీజేపీ ప్రభుత్వం..ప్రజల హక్కులను హత్య చేస్తోందని,పేదవాళ్లకు న్యాయం కోసం డిమాండ్ చేస్తున్న నోళ్లను నొక్కెయ్యాలని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో ఆరోపించింది.

ALSO READ  నదిలో పడవ బోల్తా..10మంది గల్లంతు