Priyanka Gandhi: ఆ సమయంలో అమ్మ చాలా కష్టపడింది.. ఇందిరా, సోనియా గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ప్రియాంక

44ఏళ్ల వయస్సులోనే భర్తను కోల్పోయిన తరువాత రాజకీయాల్లోకి రావటం అమ్మకు ఇష్టంలేదని, కానీ దేశానికి సేవ చేయాలనే ఒకేఒక్క నిర్ణయంతో ఆమె రాజకీయాల్లో తన జీవితాన్ని ప్రారంభించారని ప్రియాంక చెప్పారు.

Priyanka Gandhi: ఆ సమయంలో అమ్మ చాలా కష్టపడింది.. ఇందిరా, సోనియా గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ప్రియాంక

Priyanka Gandhi

Priyanka Gandhi: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ సోమవారం కర్ణాటకలో పర్యటించారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ బెంగళూరులో సోమవారం ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో ప్రియాంక పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నానమ్మ ఇందిరాగాంధీ, తల్లి సోనియాగాంధీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇద్దరు ధైర్యవంతులు, ఉక్కు సంకల్పం కలిగిన మహిళలు వారు. అలాంటివారి పెంపకంలో నేను పెరగడం ఎంతో సంతోషంగా ఉందని ప్రియాంక అన్నారు. నానమ్మ, అమ్మ పడిన కష్టాలను నేను చాలా దగ్గరగా చూశానని, ఎన్ని కష్టాలు ఎదురైనా దేశసేవే ముఖ్యమని అనుకున్నారని తెలిపారు.

Priyanka Gandhi: మరో యాత్రకు సిద్ధమవుతున్న కాంగ్రెస్.. ‘మహిళా జోడో యాత్ర’ పేరుతో పాదయాత్ర చేయనున్న ప్రియాంక

నాకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడే ఇందిరా గాంధీ తన 33ఏళ్ల కుమారుడ్ని కోల్పోయారని, సంజయ్ గాంధీ మరణించిన మరుసటిరోజు విధులకు హాజరయ్యారని ప్రియాంక గుర్తు చేసుకున్నారు. కర్తవ్యం పట్ల తనకున్న నిబద్ధత, ఆమెలో ఉన్న శక్తి అటువంటిది, ప్రాణాలు కోల్పోయే వరకూ దేశంకోసం సేవ చేశారని ఇందిరాగాంధీ సేవలను ప్రియాంక ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన తల్లి సోనియాగాంధీ మొదట్లో చాలా కష్టపడ్డారని ప్రియాంక తెలిపారు. 21ఏళ్ల వయస్సులోనే రాజీవ్ గాంధీతో ప్రేమలో పడ్డారని, ఆయన్ను పెళ్లిచేసుకునేందుకు ఇటలీ నుంచి భారత్ వచ్చారని అన్నారు. అయితే, పెళ్లిచేసుకున్న కొత్తలో భారత్ సాంప్రదాయాలను నేర్చుకొనేందుకు, వాటిని ఆచరించే క్రమంలో సోనియా చాలా కష్టపడ్డారని, నానమ్మ ఇందిరాగాంధీ ప్రతీది సోనియాకు చెబుతూ అన్ని విషయాలను నేర్పించేవారని, ఇందిరా గాంధీ నుంచి ఎన్నో విషయాలను అమ్మ నేర్చుకున్నారని ప్రియాంక అన్నారు.

Priyanka Gandhi: కేంద్రంలో అధికారంలోకి వస్తే ‘అగ్నిపథ్’ రద్దు చేస్తాం: ప్రియాంకా గాంధీ

44ఏళ్ల వయస్సులోనే భర్తను కోల్పోయిన తరువాత రాజకీయాల్లోకి రావటం అమ్మకు ఇష్టంలేదని, కానీ దేశానికి సేవ చేయాలనే ఒకేఒక్క నిర్ణయంతో ఆమె రాజకీయాల్లో తన జీవితాన్ని ప్రారంభించారని ప్రియాంక చెప్పారు. జీవితంలో ఏం జరుగుతుంది, ఎంతటి విషాదాన్ని ఎదుర్కొంటాం అనేది ముఖ్యం కాదు.. ఇంటాబయట ఎటువంటి కష్టాలు వచ్చినా స్వయంగా ఎదుర్కోవచ్చంటూ మహిళలకు ప్రియాంక గాంధీ భరోసా ఇస్తూ మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దీంతో భాగంగా సోమవారం మహిళాసదస్సు ఆ పార్టీ రాష్ట్ర అధిష్టానం నిర్వహించడంతో ప్రియాంక గాంధీ పాల్గొని స్ఫూర్తినింపే ప్రసంగం చేశారు.