Brinjal : సమస్యలున్నా… వంగసాగు వైపు రైతుల మొగ్గు

వంగ ఉష్ణమండలపు పంట. అధిక ఉష్ణోగ్రతలను, నీటి ఎద్దడిని చాలావరకు తట్టుకోగలదు, కొండప్రాంతాల్లో, చల్లటి వాతావరణంలో మొక్క పెరుగుదల తగ్గుతుంది.

Brinjal : సమస్యలున్నా… వంగసాగు వైపు రైతుల మొగ్గు

Brinjal

Brinjal : భారతదేశములో ప్రాచీనకాలము నుండి పండించబడే కూరగాయలలో వంగ ప్రధానమయినది. ఈ పంటను అన్ని బుతువులలోను పండించుటకు అనులమని చెప్పవచ్చు. పర్వత ప్రాంతాలలో వంగ వేసవిలో మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఫ్రాన్స్‌, ఇటలీ మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సైతం ఈ పంట పండిస్తున్నారు. మన దేశములో రంగు, పరిమాణము, ఆకారాన్ని బట్టి వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఎన్నో విధాలయిన వంగ రకాలు ఆయా ప్రాంతాలలో పండించబడుచున్నవి. మనదేశములో ఒరిస్సా, బీహార్‌, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర కర్టాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో వంగ విస్తారంగా పండిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వంగ విస్తీర్ణములో 5వ స్థానం, ఉత్పత్తిలో 6వ స్థానం, ఉత్పాదకతలో 3వ స్థానంలో ఉన్నది. కోస్తా ఆంధ్రలో పశ్చిమగోదావరి, విశాఖపట్నం, గుంటూరు, రాయలసీమలో చిత్తూరు, కర్నూలు మరియు తెలంగాణాలో రంగారెడ్డి జిల్లాలలో వంగ పంటను ఎక్కువ విస్తీర్ణములో పండించుచున్నారు.

వంగ సాగులో సమస్యలు:

అధిక దిగుబడినిచ్చే మేలు రకాలు మరియు సంకరజాతి రకాల విత్తనం కావలసినంతమేర రైతులకు లభ్యం కాకపోవడం సమస్యగా మారింది. ఆయాప్రాంతాలలో వినియోగదారుల అభిరుచికి తగిన రకాలు మరియు చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకాల విత్తనం సరసమయిన ధరలో రైతులకు అందుబాటులో లేకపోవడం. వెర్రి తెగులును తట్టుకొని అధిక దిగుబడినిచ్చే వంగడాల లభ్యత వంటి సమస్యలు ఉన్నప్పటికి రైతులు వంగపంటను సాగుచేయటానికి అనేక కారణాలు ఉన్నాయి.

వంగపటను అన్ని బుతువులలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. బెట్టను మరియు చౌడును కొంతవరకు తట్టుకోగలదు. అంతర సేద్యము మరియు కలుపు నివారణ ఇతర పంటలతో పోలిస్తే తేలికగా ఉంటుంది. మార్కెట్‌ ధరలలో ఒడిదుడుకులుండి గిట్టుబాటుధర రానప్పుడు చెట్టుకు వదిలి లాభసాటి ధరలున్నప్రుడు కార్మిపంట తీసుకోవడానికి అవకాశ ఉంది. దూరప్రాంతాలకు సులభంగా రవాణాకు అనుకూలము.

వంగ ఉష్ణమండలపు పంట. అధిక ఉష్ణోగ్రతలను, నీటి ఎద్దడిని చాలావరకు తట్టుకోగలదు, కొండప్రాంతాల్లో, చల్లటి వాతావరణంలో మొక్క పెరుగుదల తగ్గుతుంది. అధిక చలిని, మంచును తట్టుకోలేదు.ఇన్ని అవకాశాలున్నందున వంగ పంటను సాగుచేయుటలో తగిన మెలుకువలు పాటించినట్లయితే ఈ పంటను లాభసాటిగా పండించుకోవచ్చును.