CDAC: : సీ డాక్ లో ప్రాజెక్టు ఇంజనీర్ ఉద్యోగాలు

వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఇంటర్యూను డిసెంబరు 16 నుంచి 22 తేది వరకు నిర్వహిస్తారు. సంబంధిత రాష్ట్రాల్లోని సి-డాక్‌ కేంద్రాలు ఇందుకు వేదికలు కానున్నాయి.

CDAC: : సీ డాక్ లో ప్రాజెక్టు ఇంజనీర్ ఉద్యోగాలు

C Dac

CDAC : భారత ప్రభుత్వ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఎంఈఐటీవై) మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సి-డాక్‌) దేశంలోని వివిధ యూనిట్లలో ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 ఖాళీలు భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ,బీటెక్‌,ఎంసీఏ, ఎంఈ,ఎంటెక్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయస్సు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలకు రూ.26,500 నుంచి రూ.1,35,000 వరకు వేతనం చెల్లిస్తారు.

వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఇంటర్యూను డిసెంబరు 16 నుంచి 22 తేది వరకు నిర్వహిస్తారు. సంబంధిత రాష్ట్రాల్లోని సి-డాక్‌ కేంద్రాలు ఇందుకు వేదికలు కానున్నాయి. ఎంపికైన అభ్యర్ధులు ఢిల్లీ, చెన్నై, సిల్చర్‌, జమ్మూ, తిరువనంతపురంలలో వర్క్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.cdac.in/index.aspx? id=ca_CDACAdvt_Consolidate-d02122021_Newసంప్రదించగలరు.