Rajasthan: ఆస్పత్రికి తాళంవేసి పానీపూరీ బండి పెట్టుకున్న వైద్యురాలు.. సీఎం గెహ్లాట్ ఆగ్రహం

రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) ప్రభుత్వం ‘రైట్ టూ హెల్త్’ బిల్లు (Right to Health Bill)ను ఆమోదించింది. నూతన బిల్లు ప్రకారం.. ప్రతి పౌరుడు అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి చార్జీలు చెల్లించకుండానే ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స పొందవచ్చు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు తమ నిరసన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మహిళ వైద్యులు పానీ పూరీ బండి పెట్టి, టీ దుకాణాల ద్వారా టీ విక్రయాలు చేస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఆందోళన విరమించాలని చెప్పినా వినకపోవటంతో సీఎం గెహ్లాట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rajasthan: ఆస్పత్రికి తాళంవేసి పానీపూరీ బండి పెట్టుకున్న వైద్యురాలు.. సీఎం గెహ్లాట్ ఆగ్రహం

Rajasthan

Rajasthan: రాజస్థాన్‌ (Rajasthan) లోని సికార్ జిల్లా (Sikar district) కు చెందిన ఓ మహిళా వైద్యురాలు ఆస్పత్రికి తాళంవేసి రోడ్డుపై పానీపూరీ బండి (Panipuri cart) పెట్టుకుంది. బండిపై ప్రైవేటు వైద్యురాలు (Private doctor) అనికూడా రాసి ఉంది. అంతేకాదు, ఆస్పత్రిలో పనిచేసే సిబ్బందిసైతం పానీపూరీ బండి పక్కనే టీ దుకాణం పెట్టి టీ విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా (Social media) లో వైరల్‌గా మారాయి. ఇలాంటి ఘటనలు ఒక్క సికార్ జిల్లాలోనే కాదు.. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు చెందిన పలువురు వైద్యులు, సిబ్బంది రోడ్లపైకొచ్చి పానీ పూరీ, టీ విక్రయాలు చేస్తున్నారు. ఇదేదో బతుకుదెరువుకోసం, డబ్బులు సంపాదించేందుకు చేస్తున్న పనులుకావు. రాజస్థాన్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా వైద్యులు ఇలా చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన షాక్‌కు ప్రైవేట్ ఆస్పత్రులకు తాళాలు వేసిమరీ సిబ్బందితో‌సహా ఆస్పత్రి వైద్యులు రోడ్లపైకొచ్చి తమ నిరసనను వినూత్నరీతిలో తెలుపుతున్నారు.

Rajastan Crisis: పార్టీ వ్యతిరేకులను వదలను.. పైలట్‭కు గెహ్లాట్ పరోక్ష హెచ్చరిక

రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్  (CM Ashok Gehlot) ప్రభుత్వం ఇటీవల కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు ప్రకారం.. ప్రతి పౌరుడు అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి చార్జీలు చెల్లించకుండానే ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స పొందవచ్చు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు తమ నిరసన తెలియజేస్తున్నారు. వారి నిరసనల మధ్యనే ‘రైట్ టూ హెల్త్’ బిల్లు (Right to Health Bill)ను రాజస్థాన్ ప్రభుత్వం ఆమోదించింది. ఈ బిల్లుతో ప్రైవేట్ ఆస్పత్రుల వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని ప్రైవేట్ వైద్యులు ఆందోళన బాట పట్టారు.

Fake Doctors: పరీక్షలో ఫెయిలైనా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లు.. సీబీఐ కేసు నమోదు.. నిందితులు విదేశాల్లో చదివిన డాక్టర్లు

ఈనెల 29న వైద్యులు, వైద్య సిబ్బంది పెద్దఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వైద్యులు చేస్తున్న ఆందోళనల పట్ల సీఎం గెహ్లాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులందరూ విధుల్లోకి రావాలని మీడియా ద్వారా ప్రభుత్వం ఆదివారం కోరింది. కానీ ఎలాంటి స్పందన వైద్యుల నుంచి రాలేదు. ఈ క్రమంలో వైద్యుల నిరసనలను అణిచివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.