రాజస్తాన్‌-హర్యాణా సరిహద్దులో ఉద్రిక్తత

రాజస్తాన్‌-హర్యాణా సరిహద్దులో ఉద్రిక్తత

farmers remove barricades వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలతో రాజస్థాన్‌-హర్యాణా సరిహద్దు షాజహాన్‌పూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు ట్రాక్టర్ ర్యాలీగా వెళ్తున్న రాజస్తాన్ రైతులను సరిహద్దులో హర్యాణా పోలీసులు అడ్డుకున్నారు. రైతులు బోర్డర్ దాటకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

పోలీసులతో ఘర్షణకు దిగిన రైతులు, టోల్‌ప్లాజాపై దాడికి యత్నించారు. పోలీసులు అడ్డుగా ఏర్పాటు చేసిన బారికేడ్లను రైతులందరూ కలిసి తొలగించారు. ఈ క్రమంలో దీంతో రైతులతో పోలీసులు లాఠీలు ఝులిపించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోలేకపోయారు. కొంతమంది రైతులు..ట్రాక్టర్లు,ఇతర వాహనాల్లో సరిహద్దులు దాటి హర్యాణాలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి ఢిల్లీ సరిహద్దులోని సింఘు వద్దకు చేరనున్నారు. నెల రోజులకుపైగా అక్కడ నిరసనలు చేస్తున్న 40 సంఘాల రైతులతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేయనున్నారు.