Biological-E Corbevax : బయో-ఈ వ్యాక్సిన్ ధరపై నీతి ఆయోగ్ ఏమన్నదంటే?

స్వదేశీ పరిజ్ఞానంతో బయాలాజికల్-ఈ సంస్థ తయారు చేస్తున్నకార్బెవాక్స్ టీకా ధర ఎంత ఉంటుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. దేశంలోనే అత్యంత చౌకైన ధరకే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోందని ప్రచారం కొనసాగుతోంది.

Biological-E Corbevax : బయో-ఈ వ్యాక్సిన్ ధరపై నీతి ఆయోగ్ ఏమన్నదంటే?

Biological E Corbevax

Biological-E Corbevax : స్వదేశీ పరిజ్ఞానంతో బయాలాజికల్-ఈ సంస్థ తయారు చేస్తున్నకార్బెవాక్స్ టీకా ధర ఎంత ఉంటుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. దేశంలోనే అత్యంత చౌకైన ధరకే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోందని ప్రచారం కొనసాగుతోంది. ఈ వ్యాక్సిన్ ధరపై తాజాగా నీతి ఆయోగ్ స్పందించింది. కార్బెవాక్స్ టీకా ధరను బయాలాజికల్-ఈ సంస్థ నిర్ణయించేవరకు వేచి చూద్దామని నీతి ఆయోగ్ ఆరోగ్య శాఖ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ అన్నారు.

కొత్త పాలసీ ప్రకారం.. ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై టీకా ధర ఆధారపడి ఉంటుందని తెలిపారు. వ్యాక్సిన్ తయారీకి అందించిన ఆర్థిక సాయం కూడా వ్యాక్సిన్ ధరను ప్రభావితం చేస్తుందని చెప్పారు. బయాలాజికల్ ఈ వ్యాక్సిన్ ధర మిగతా వ్యాక్సిన్లతో పోల్చితే అత్యంత చౌకగా లభించనుందని అంటున్నారు. బయోలాజికల్-ఈ కార్బెవాక్స్ తాత్కాలిక శాస్త్రీయ డేటా చాలా ఆశాజనకంగా ఉందని కేంద్రం తెలిపింది.

ఈ వ్యాక్సిన్ రెండు డోసులూ కలిపి కేవలం రూ.400 నుంచి రూ.500 మధ్య ఉండే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.