కరోనా వేళ : PSU Bank ఉద్యోగులకు వేతనాలు పెరిగాయి

  • Published By: madhu ,Published On : July 23, 2020 / 12:38 PM IST
కరోనా వేళ : PSU Bank ఉద్యోగులకు వేతనాలు పెరిగాయి

చైనా నుంచి వచ్చిన దిక్కుమాలిన కరోనా వైరస్ తో ఆర్థిక రంగం కుదేలైపోయింది. ఎన్నో సంస్థలు నష్టాల బాట పట్టగా..మరికొన్ని మూతపడ్డాయి. కొన్ని సంస్థలైతే ఉద్యోగులను తొలగించడం, వారి జీతాలను కట్ చేయడం వంటివి చేస్తున్నాయి.

కానీ PSU Bank మాత్రం ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పని చేసే 9 లక్షల మంది ఉద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించింది. ఉద్యోగులకు 15 శాతం వేతనంతో పాటు..పెన్షన్ కంట్రిబ్యూషన్ నాలుగు శాతం పెంచేందుకు Indian Banks’ Association – United Forum of Bank Unions  మధ్య ఒప్పందం కుదిరింది.

వేతనాలు, పెన్షన్ కంట్రిబ్యూషన్ పెంపుతో ఉద్యోగుల వార్షిక వేతన బిల్లు రూ. 7900 కోట్ల మేర పెరగనున్నట్లు అంచనా. నవంబర్ 2017 నుంచి వర్తించనుందని, గతంలో ఈ ఉద్యోగుల బేసిక్ వేతనంలో 10 శాతం, డీఏ, రిటైర్ మెంట్ ప్రయోజనాల్లో కలుస్తోంది.

తాజాగా చేసిన వేతన సవరణతో 14 శాతం Basic, DA, Pension మొత్తానికి జమ కాబడుతుంది. ఈ బ్యాంకు ఉద్యోగులకు వేతన పెంపుతో పాటు…5 శాతం అంతకుమించి నిర్వాహణ లాభాలు ఆర్జించిన బ్యాంకుల ఉద్యోగులు ఇన్సెంటివ్ లు అందుకోనున్నారు.