పిచ్చి పీక్ లో : పబ్ జీ కోసం మొబైల్ కొనివ్వలేదని సూసైడ్

  • Published By: veegamteam ,Published On : February 4, 2019 / 05:55 AM IST
పిచ్చి పీక్ లో : పబ్ జీ కోసం మొబైల్ కొనివ్వలేదని సూసైడ్

ముంబై : పబ్ జీ గేమ్ పిచ్చి పరాకాష్టకు చేరుకుంది. ఆటలో లీనం అయ్యి.. స్వయంగా ఆట అడుతున్నట్లు ఫీలవుతున్నారు యువకులు. గేమ్స్ మోజులో ప్రాణాలు తీయడానికి, తీసుకోవడానికి వెనకాడటం లేదు. పబ్ జీ గేమ్ ఆడొద్దని చెప్పినందుకు ఢిల్లీలో ఓ యువకుడు తన సోదరిని కత్తితో పొడిచి హత్య చేసిన విషయం తెలిసింది. మరో ఘోరమైన ఘటన వెలుగు చూసింది. ముంబైలో పబ్‌జీ ఆడటానికి కొత్త మొబైల్ ఫోన్ కొనివ్వలేదని ప్రాణాలు తీసుకున్నాడు యువకుడు.
 

ముంబై సిటీ నెహ్రూనగర్‌కు చెందిన 18 ఏళ్ల యువకుడు నదీమ్ షేక్. పబ్‌జీ గేమ్‌కు బానిస అయ్యాడు. గేమ్ ఆడే సమయంలో ఫోన్ హ్యాంగ్ అవుతుంది. దీంతో కొత్త మొబైల్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడిగాడు. అది కూడా రూ.37వేల విలువైన మొబైల్ కావాలని గొడవకి దిగాడు. పేరంట్స్ ఒప్పుకోలేదు. అంత డబ్బు ఇవ్వలేమని స్పష్టం చేశారు. రూ.20వేల రూపాయల్లో కొత్త ఫోన్ కొనుక్కోవాలని సూచించారు పేరంట్స్. ఆ మొబైల్ లో పబ్ జీ గేమ్ ఆడలేనంటూ అలిగాడు. అయినా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపానికి గురైన నదీమ్.. ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయాడు. కుటుంబ సభ్యులు నిద్రపోయిన తర్వాత.. తన గదిలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మొబైల్, గేమ్ పిచ్చిలో పడి ప్రాణాలు తీసుకొని తల్లిదండ్రులు విలపిస్తున్నారు.