రాహుల్ కూడా…వీర్ సావర్కర్ ని గౌరవించనివాళ్లని సెంటర్ లో కొట్టాలి

  • Published By: venkaiahnaidu ,Published On : August 23, 2019 / 12:09 PM IST
రాహుల్ కూడా…వీర్ సావర్కర్ ని గౌరవించనివాళ్లని సెంటర్ లో కొట్టాలి

వీర్ సావర్కర్ ని గౌరవించని వాళ్లని తప్పనిసరిగా బహిరంగంగా కొట్టాలని శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే అన్నారు. ఎందుకంటే భారత స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమంలో వీర్ సావర్కర్ పడ్డ కష్టం,ప్రాధాన్యత గురించి వాళ్లు ఇంకా రియలైజ్ అవ్వలేదన్నారు. రాహుల్ గాంధీ కూడా గతంలో వీర్ సావర్కర్ ను అవమానించారన్నారు.

గురువారం  కాంగ్రెస్ విద్యార్థి విభాగం(NSUI) ఢిల్లీ యూనివర్శిటీలో వీర్ సావర్కర్ విగ్రహానికి నలుపురంగు పూసి,చెప్పుల దండ వేసిన సందర్భంగా శివసేన చీఫ్ ఇవాళ ఈ వ్యాఖ్యలు చేశారు. వీర్ సావర్కర్ గురించి తప్పుగా మాట్లాడితే వాళ్లన్ని సర్కిళ్లలో నిలబెట్టి బహిరంగంగా కొట్టాలని,వీర్ సావర్కర్ మరాఠా ఆణిముత్యమని ఉద్దవ్ ఠాక్రే అన్నారు.