బలపరీక్ష ముందు..పుదుచ్చేరిలో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా

బలపరీక్ష ముందు..పుదుచ్చేరిలో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా

Puducherry కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.మరో కాంగ్రెస్​ ఎమ్మెల్యే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్​భవన్​ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ నారాయణ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ వీపీ శివకోజుండుకు రాజీనామా లేఖను ఆదివారం అందజేశారు.

కాగా, నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో ఈ నెల 22న శాసనసభలో బలనిరూపణ చేసుకోవాలని రెండు రోజుల క్రితం పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్ తమిళిసై.. ప్రభుత్వాన్ని ఆదేశించిన విష్యం తెలిసిందే. సీఎం నారాయణ స్వామి ఈ నెల 22న సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కోరారు. బలపరీక్షకు ఒక రోజు ముందు మరో ఎమ్మెల్యే రాజీనామా చేయడం కీలకంగా మారింది.

పుదుచ్చేరిలో మొత్తం 33 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తాజాగా లక్ష్మీ నారాయణ్ రాజీనామాతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 13కు పడిపోయింది.మరోవైపు విపక్షాలకు సభలో 14 స్థానాలు ఉన్నాయి. పుదుచ్చేరి అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారాయి.