ఉల్లి దొంగను చితక్కొట్టేశారు : డిమాండ్ అలా ఉంది మరి

  • Published By: veegamteam ,Published On : December 9, 2019 / 07:18 AM IST
ఉల్లి దొంగను చితక్కొట్టేశారు : డిమాండ్ అలా ఉంది మరి

పుదుచ్చేరిలో ఉల్లిపాయల్ని దొంగలించిన వ్యక్తిని పట్టుకుని చితక్కొట్టేశారు. ఉల్లిపాయలు బంగారంలా మారిపోయాయి మరి. దీంతో ఉల్లిపాయలపై ఎన్నో జోకులు పేలుతున్నాయి సోషల్ మీడియాలో. ఈ క్రమంలో పుదుచ్చేరిలోని రంగపిళ్లై వీధిలో ఓ వ్యాపారి ఉల్లిపాయల బస్తాల లోడ్ ను దిగుమతి చేసుకున్నాడు.  ఇదే అదను అనుకున్నాడేమో.. ఓ వ్యక్తి ఉల్లి లారీ నుంచి దిగుమతి చేస్తున్న సమయంలో ఓ ఉల్లిబస్తాను నెమ్మదిగా..తీసుకుని బైక్ పై పెట్టుకుని వెళ్లిపోయాడు. అంతటితో ఆగలేదు. మరో బస్తా పట్టుకెళ్లటానికి వచ్చి ఇరుక్కుపోయాడు.  

ఒక్క బస్తాని సక్సెస్ ఫుల్ గా పట్టికెళ్లిపోయి సరిపెట్టుకోకుండా..అత్యాసకుపోయాడు. మరో బస్తా పట్టుకెళ్లటానికి వచ్చి బస్తాను బైక్ పై పెట్టుకునే సమయంలో పక్కనే ఉన్న దుకాణాల్లోని వ్యాపారస్తులు గమనించారు. వెంటనే అతణ్ని పట్టుకున్నారు. చితక్కొట్టారు. 
 
పుదుచ్చేరికి బెంగుళూరు, చెన్నై, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి లారీల ద్వారా కాయగూరలు దిగుమతి అవుతుంటాయి. అసలే ఉల్లి ధరలు మండిపోతున్నాయి. పుదుచ్చేరి మార్కెట్‌లో ఉల్లి కిలో రూ.120 నుంచి రూ.180 వరకు అమ్ముతున్నారు. ఈ  క్రమంలో బెంగుళూరు నుంచి శుక్రవారం (డిసెంబర్ 6) రాత్రి వేల్‌మురుగన్‌ అనే వ్యాపారి దుకాణానికి ఉల్లి పాయల లోడుతో లారీ వచ్చింది. లారీ నుంచి బస్తాలను దుకాణం ముందు దించేసి కూలీలు వెళ్లిపోయారు.
కాసేపటికి ఓ వ్యక్తి ఉల్లి బస్తాను బైక్‌పై పట్టుకెళ్లటం పక్క దుకాణాల్లో పనిచేస్తున్న వారు అతడిని పట్టుకున్నారు. గట్టిగా కొట్టారు. దీంతో అసలు విషయం చెప్పాడు. అప్పటికే అతను ఒక బస్తాను పట్టుకెళ్లి..మరో బస్తా కోసం వచ్చాడని తెలుసుకుని..వ్యాపారులు అతణ్ని కుమ్మేశారు. పాపం ఉల్లిపాయల దొంగ అలా దొరికిపోయి తన్నులు తినాల్సి వచ్చింది.