Digha Sea Beach: చనిపోయి తీరానికి కొట్టుకొస్తున్న పఫర్ చేపలు

పశ్చిమబెంగాల్ లోని దిఘా బీచ్ పర్యాటకుల చాలా ప్రసిద్ధి. ఇప్పుడంటే కోవిడ్ కారణంగా పర్యాటకుల తాకిడి తగ్గింది కానీ ఒకనాడు ఈ బీచ్ పర్యాటకులకు బెస్ట్ స్పాట్. ఇప్పుడు కరోనా తర్వాత కూడా దిఘా బీచ్ పర్యాటకులను ఆకర్షిస్తుంది. సోమవారం కూడా అలానే పర్యాటకులు బీచ్ లో ఉండగా వేలసంఖ్యలో పఫర్ చేపలు చనిపోయి తీరానికి కొట్టుకొచ్చాయి.

Digha Sea Beach: చనిపోయి తీరానికి కొట్టుకొస్తున్న పఫర్ చేపలు

Digha Sea Beach

Digha Sea Beach: పశ్చిమబెంగాల్ లోని దిఘా బీచ్ పర్యాటకుల చాలా ప్రసిద్ధి. ఇప్పుడంటే కోవిడ్ కారణంగా పర్యాటకుల తాకిడి తగ్గింది కానీ ఒకనాడు ఈ బీచ్ పర్యాటకులకు బెస్ట్ స్పాట్. ఇప్పుడు కరోనా తర్వాత కూడా దిఘా బీచ్ పర్యాటకులను ఆకర్షిస్తుంది. సోమవారం కూడా అలానే పర్యాటకులు బీచ్ లో ఉండగా వేలసంఖ్యలో పఫర్ చేపలు చనిపోయి తీరానికి కొట్టుకొచ్చాయి. తీరంలో ఎక్కడ చూసినా చనిపోయిన చేపలే కనిపించడంతో పర్యాటకులతో పాటు స్థానికులలో కూడా ఆశ్చర్యపోయారు. రోజూ సముద్రంలోకి వెళ్లే జాలర్లు సైతం దీన్ని ఆసక్తిగా భావించారు.

ఇప్పటికే దీనిపై స్పందించిన పర్యావరణ వేత్తలు చేపలు చనిపోయి కొట్టుకురావడం వెనుక కారణాలను అన్వేషిస్తున్నారు. కాగా.. చేపలు చనిపోయి తీరానికి వచ్చిన చేపలను మళ్లీ సముద్ర నీటిలోకి కలవకుండా జాగ్రత్తపడాలని సూచించారు. ఎందుకంటే.. చనిపోయిన చేపలు ఆల్రెడీ కుళ్లిపోతుండగా అవి మళ్ళీ తిరిగి సముద్రంలో కలిస్తే సముద్ర నీరు కలుషితం అవుతుందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడ్డారు. దీంతో అటవీ శాఖ రంగంలోకి దిగి చేపల్ని అక్కడి నుంచి తరలిస్తోంది.

కాగా, చేపలు చనిపోవడం వెనుక కారణాలపై అభిప్రాయపడిన పర్యావరణవేత్తలు జాలర్లు తరచూ చేపల వేటకు వెళ్తుండగా.. వారు ఉపయోగించే కిలోమీటర్ల పొడవున్న వలలలో చిక్కడం వల్లే ఈ చేపలు చనిపోయి ఉంటాయనే అంచనా వేస్తున్నారు. ఈ వాదనను మాత్రం జాలర్లతో పాటు స్థానికులు తప్పుబడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడే వలలలో చిక్కుకొని చనిపోవడం ఎంత వరకు నిజమని ప్రశ్నిస్తున్నారు. వలలకు చిక్కితే మాత్రం ఇంత భారీ స్థాయిలో చనిపోతాయా అని ప్రశ్నిస్తున్నారు. మరి దీని వెనుక కారణం ఏంటో పూర్తిస్థాయి దర్యాప్తు చేయనుండగా ఆ తర్వాత నిజాలు తేలే అవకాశం ఉంది.