Pulse Oximeter: భయం.. భయం.. పల్స్ ఆక్సీమీటర్లు కూడా అవుట్ ఆఫ్ స్టాక్

కొవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా యావత్ భారతమంతా భయంతో వణికిపోతుంది. ఇదిలా ఉంటే సమస్య అంటూ హాస్పిటల్ కు వెళితే డాక్టర్ ను కలవడానికి...

Pulse Oximeter: భయం.. భయం.. పల్స్ ఆక్సీమీటర్లు కూడా అవుట్ ఆఫ్ స్టాక్

Pulse Oximeter

Pulse Oximeter: కొవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా యావత్ భారతమంతా భయంతో వణికిపోతుంది. ఇదిలా ఉంటే సమస్య అంటూ హాస్పిటల్ కు వెళితే డాక్టర్ ను కలవడానికి పదుల సంఖ్యలో క్యూలో నిలబడాలి. అప్పటి వరకూ లేనిపోని సమస్యలు వచ్చిపడతాయని సేఫ్టీ కోసం ఇంట్లోనే మెడిసిన్ తెచ్చిపెట్టుకుంటున్నారు.

ఎప్పటికప్పుడు సెల్ఫ్ అనాలసిస్ కోసం పల్స్ చెక్ చేసుకోవడం, టెంపరేచర్ చూసుకోవడం వంటివి చేస్తున్నారు. వాటి కోసం థర్మామీటర్లు, పల్స్ ఆక్సీమీటర్లు క్యారీ చేస్తుంటే.. ఇప్పుడు అవి కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయట. కేరళ రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి.

మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన యాక్టివ్ కేసులు 2లక్షల 47వేల 181నమోదయ్యాయి. అంటే మొత్తం 250శాతం కేసులు పెరిగాయయని తెలుస్తుండగా 32వేల 819 కేసులతో ఆల్ టైం హైగా కనిపించింది.

పల్స్ ఆక్సీమీటర్ స్టాకిస్ట్ కే.ప్రవీణ్ మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా రిటైలర్స్, ఫ్రెండ్స్ నుంచి ఒక్క పీస్ ఉంటే పంపించమంటూ అడుగుతున్నారు. ‘మాకు స్టాక్ ఢిల్లీ, ముంబై నుంచి వస్తుంది. కొన్నిసార్లు బెంగళూరు నుంచి కూడా తెచ్చుకుంటాం. ఇప్పుడు వారితో మాట్లాడి అమ్ముడుపోనివి ఏమైనా ఉంటే అర్జెంట్ గా పంపించమని కోరుతున్నాం.

మా రిటైలర్లకు వాటిని రూ.900కే అమ్ముతున్నాం. కానీ, రెండు వారాలుగా అసలు అవి స్టాక్ లోనే కనిపించడం లేదు. చైనా నుంచి రావాల్సిన కార్గో విమానాలు రాకపోవడంతో సీరియస్ పరిస్థితి ఏర్పడింది అని ప్రవీణ్ చెబుతున్నారు. మెడికల్ షాప్స్ లో, మెడికల్ కాలేజి హాస్పిటల్స్ వద్ద సింగిల్ పీస్ ఆక్సీమీటర్ కొనుగోలు చేయడం కోసం బారులు తీరి కనిపిస్తున్నారు ప్రజలు.