భారత సైన్యం ప్రతీకారం : పుల్వామా దాడి సూత్రధారి హతం

పుల్వామా ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. పుల్వామా ఉగ్రదాడి ఘటనలో కీలక సూత్రధారి అయిన జైషే మహ్మద్‌ కమాండర్‌ రషీద్‌ ఘాజీతో పాటు మరో ఉగ్రవాది

  • Published By: veegamteam ,Published On : February 18, 2019 / 06:03 AM IST
భారత సైన్యం ప్రతీకారం : పుల్వామా దాడి సూత్రధారి హతం

పుల్వామా ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. పుల్వామా ఉగ్రదాడి ఘటనలో కీలక సూత్రధారి అయిన జైషే మహ్మద్‌ కమాండర్‌ రషీద్‌ ఘాజీతో పాటు మరో ఉగ్రవాది

పుల్వామా ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. పుల్వామా ఉగ్రదాడి ఘటనలో కీలక సూత్రధారి, సూసైడ్ బాంబర్ ఆదిల్‌కు శిక్షణ ఇచ్చిన జైషే మహమ్మద్ కమాండర్ రషీద్‌ ఘాజీతో పాటు మరో ఉగ్రవాది కమ్రాన్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. సోమవారం(ఫిబ్రవరి-18-2019) ఉదయం 11గంటల ప్రాంతంలో ఆ ఇద్దరిని భారత ఆర్మీ హతమార్చింది. ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో(పుల్వామా జిల్లాలోని పింగ్లాన్‌) ఆదివారం (ఫిబ్రవరి-17-2019) రాత్రి నుంచి ఎన్‌కౌంటర్ జరుగుతోంది.

 

టెర్రరిస్టులు చొరబడ్డారనే సమాచారంతో బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ సమయంలో ఓ ఇంట్లో నక్కిన ముష్కరులు కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ఓ మేజర్, ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఓ పౌరుడు చనిపోయాడు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, ఎన్‌కౌంటర్ ప్రారంభించిన సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ భద్రతా దళాలు.. ఘాజీ, రషీద్‌లను హతమార్చారు. మరణించింది రషీదేనని ఓ సైనికాధికారి స్పష్టం చేశారు. మరో ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడినట్టు తెలుస్తోంది. ఘటనాస్థలిని భద్రతా దళాలు పూర్తిగా అదుపులోకి తీసుకున్నాయి. 10గంటలకు పైగా ఎన్‌కౌంటర్ సాగింది. పుల్వామా మాస్టర్ మైండ్‌ను భద్రతా దళాలు హతమార్చిన విషయాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని మోడీకి వివరించినట్టు తెలుస్తోంది.

 

ఫిబ్రవరి 14వ తేదీ పుల్వామా జిల్లాలోని అవంతిపొరాలో సీర్పీఎఫ్ క్వానాయ్ లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 40మంది జవాన్లు అమరులయ్యారు. కశ్మీర్‌కు చెందిన ఆదిల్ దార్‌ను సూసైడ్ బాంబర్‌గా వాడుకున్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌ ఆదిల్‌కు ఏడాది పాటు శిక్షణ ఇచ్చింది.