‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’  అన్న రైల్వే ఉద్యోగి : అరెస్ట్ 

  • Published By: veegamteam ,Published On : February 16, 2019 / 09:00 AM IST
‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’  అన్న రైల్వే ఉద్యోగి : అరెస్ట్ 

పూణె : జమ్ముకశ్మీర్‌ లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌పై మానవబాంబు దాడి ఘోరంపై దేశవ్యాప్తంగా జనాగ్రహం వెల్లు వెత్తుతుంటే ఓ రైల్వే ఉద్యోగి మాత్రం పాకిస్థాన్ జిందాబాద్ అంటు నినాదాలు చేశాడు. ఉగ్రవాదులకు, పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ర్యాలీలు,నిరసనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. పాక్ ఉగ్రవాదంపై ప్రతీకారం తీసుకోవాలంటే దేశ వ్యాప్తంగా డిమాండ్స్   వెల్లువెత్తుతున్న క్రమంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి చేసిన ఈ నినాదాలపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు స్థానికులు. 

మహారాష్ట్ర పుణె జిల్లా  లోవాలా ప్రాంతంలోని శివాజీ చౌక్ వద్ద శుక్రవారం (ఫిబ్రవరి 15)న స్థానికులు అమర జవాలకు నివాళులర్పిస్తున్నారు. ఈ సమయంలో ఉపేంద్రకుమార్‌ బహుదూర్‌ సింగ్‌ అనే రైల్వే ఉద్యోగి  ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అంటూ పెద్ద పెట్టున అరిచాడు. ఈ హఠాత్పరిణామంతో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. తేరుకున్న వెంటనే అతనిపై తీవ్ర ఆగ్రహంతో  నువ్వు ఇండియన్ వేనా? అంటు దాడిచేసేందుకు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి బహుదూర్‌సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఐపిసి సెక్షన్ 153 (బి) (జాతీయ పరస్పర అభియోగాలపై ఆరోపణలు, ఆరోపణలు) కింద కేసు నమోదు చేసి కోర్టు సూచన మేరకు రిమాండ్‌కు తరలించారు. ఈ దాడిలో సీఆర్ఎఫ్ జవాన్లు 49మంది బలైపోయిన విషయం తెలిసిందే.