పుల్వామా దాడి : ఆర్డీఎక్స్ పాక్ మిలటరీదేన‌న్నఫోరెన్సిక్ ఎక్స్ ప‌ర్ట్స్

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 09:53 AM IST
పుల్వామా దాడి : ఆర్డీఎక్స్  పాక్ మిలటరీదేన‌న్నఫోరెన్సిక్ ఎక్స్ ప‌ర్ట్స్

శ్రీనగర్ : పుల్వామా పేలుడులో 50 నుంచి 70 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించారని సీనియర్ పేలుడు పదార్థాల నిపుణుడు వెల్లడించారు. పుల్వామాలో ఆత్మాహుతి దాడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన ఫోరెన్సిక్ నిపుణులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. మిలటరీ వినియోగించే స్థిరమైన ఆర్డీఎక్స్‌ను కారు బాంబులా మార్చి దాడికి పాల్పడినట్టు ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు. 

ఈ కారు బాంబును పాక్ లో శిక్షణ పొందిన వ్యక్తి తయారు చేశాడని..టిగ్గర్ స్విచ్..డిటోనేటర్..పవర్ ఫ్యూజ్ లను సంఘటన స్థలం సమీప ప్రాంతంలోనే అమర్చాడని నిపుణులు అంచనావేశారు. భారతదేశంలో సైన్యం వాడే ప్రతీ గ్రాము ఆర్డీఎక్స్ పై లెక్కలు (ఆడిట్) కచ్చితంగా ఉంటుందనీ..కానీ పాకిస్థాన్ మిలటరీ వాడే పేలుడు పదార్ధాలను ఉగ్రవాదులకు సరఫరా చేస్తుంటారని ఇంటలిజెన్స్ (ఐబీ) వెల్లడించింది. పుల్వామాలో మానవబాంబుగా మారిన ఆదిల్ అహ్మద్ దార్ మెంటల్ గా ప్రిపేర్ అయిన తరువాతనే మానవబాంబుగా మారి ఈ దాడికి పాల్పడ్డాడని తెలిపారు.