మమ్మల్ని యుద్ధానికి పంపండి: మోడీకి ఖైదీల లేఖ 

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 06:36 AM IST
మమ్మల్ని యుద్ధానికి పంపండి: మోడీకి ఖైదీల లేఖ 

ఢిల్లీ : పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడితో దేశమంతా భగ్గుమంటోంది. చిన్న పెద్ద..అనే తేడా లేకుండా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి భారతీయుడు రగిలిపోతున్నాడు. బయట ఉన్న వారే కాదు జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా సమరానికి సై అంటున్నారు. కేరళ, బీహార్ రాష్ట్రంలోని గోపాల్‌ గంజ్ సబ్ డివిజనల్ జైలులోని ఖైదీలు ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు.

 

జవాన్లను పొట్టనపెట్టుకున్న ఘటనతో తమ రక్తం మరిగిపోతోందని.. తమను పాక్‌పై యుద్ధానికి పంపిచాలని ఖైదీలు లేఖలో ప్రధానిని కోరారు. ఈ యుద్ధంలో మరణిస్తే భారతమాత రుణం తీర్చుకున్నట్లుగా భావిస్తామన్నారు. విజయం సాధించి ప్రాణాలతో వస్తే తిరిగి జైలుకే పంపించాలన్నారు. యుద్ధం వస్తే తాము సరిహద్దుల్లో ముందు నిలిచి శత్రువులతో పోరాడేందుకు సిద్ధమని ప్రకటించారు. పాక్ పై కొదమ సింహాల్లా విరుచుకుపడతామని ప్రధానికి రాసిన లేఖలో ఖైదీలు స్పష్టం చేశారు. జైల్లోని 250మంది ఖైదీలు ఈ లేఖపై సంతకం చేశారని జైలు అధికారులు తెలిపారు.

 

ఉగ్రదాడిలో అమరులైన సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు ఖైదీలంతా తమ వంతుగా.. రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించారు. 30మంది మహిళా ఖైదీలు సహా 750 మంది ఉండగా, ఇందులో 102మంది శిక్షలు అనుభవిస్తున్న వారు కాగా, మిగతా వారు అండర్ ట్రయల్ ఖైదీలు. అమరుల కుటుంబాలకు ఖైదీలు చేసిన సాయం తక్కువే అయినా, వారి సంకల్పం గొప్పదని జైలు సూపరింటెండెంట్ సందీప్ అన్నారు.

 

Read Also : భారత్ యుద్ధానికి వస్తే మేమూ సిద్ధమే : పాక్ కౌంటర్

Read Also : ఎవరి ఆదేశాలో తెలుసా : పాకిస్తానీలు 48 గంటల్లో వెళ్లిపోండి

Read Also : భారత్ యుద్ధానికి వస్తే మేమూ సిద్ధమే : పాక్ కౌంటర్