పూణేలో భారీ వర్షాలు : గోడ కూలి ఐదుగురు మృతి

  • Published By: veegamteam ,Published On : September 26, 2019 / 09:33 AM IST
పూణేలో భారీ వర్షాలు : గోడ కూలి ఐదుగురు మృతి

మహారాష్ట్రలోని పూణే నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరద నీటి నిర్మాణాలు కూలుపోతున్నాయి. ఈ క్రమంలో సహకార నగర్ లో ఓ ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ  ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే  మృతి చెందారు. అగ్నిమాపకశాఖ, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని చేపట్టారు.  శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు. పూణే గత పదిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలు కురుస్తుండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. 

సింహగడ్ రోడ్, ధనక్వాడి, బాలాజినగర్, అంబెగావ్, సహకర్ నగర్,  కొల్హేవాడి,పురందర్, బారామతి, భోర్,హవేలి తహసీల్, వంటి పలు ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరుకుంది. దీంతో పూణే జిల్లా కలెక్టర్ నావల్ కిషోర్ రామ్ గురువారం (సెప్టెంబర్ 26)న నగరంలోని అన్ని స్కూల్స్, కాలేజీలకు  సెలవు ప్రకటించామని కలెక్టర్ తెలిపారు.

భారీవర్షాలకు వరదలు వెల్లువెత్తాయి. ముంబై నగరంలోని ఖర్ ప్రాంతంలో ఓ భవనం కూలిన ఘటనలో పదేళ్ల బాలిక మరణించింది. బాలిక మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. భారీవర్షాల వల్ల పాత భవనాలు కూలిపోతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.