100 అడుగుల లోయలో పడిన కొడుకు : అమ్మ పిలుపుతో బతికి బైటపడ్డాడు

  • Published By: veegamteam ,Published On : January 11, 2020 / 10:09 AM IST
100 అడుగుల లోయలో పడిన కొడుకు : అమ్మ పిలుపుతో బతికి బైటపడ్డాడు

కన్నతల్లి ఫోన్ కాల్ తో ప్రాణాలతో బైటపడ్డ కొడుకు ఉదంతం పూనెలో జరిగింది. 100 అడుగుల లోయలో పడిపోయిన కొడుకు తల్లి ఫోన్ కాల్ తో బతికిబైటపడ్డాడు. 
మహారాష్ట్రలో  ఒక సాఫ్ట్ వేర్ ‌ఇంజినీరు పూణెలోని సింహగఢ్ కోట దగ్గర విండ్ పాయింట్ నుంచి లోయలో పడిపోయాడు. లోయలో పడిపోయి తీవ్ర గాయాలతో నిస్సహాయంగా అక్కడే పడివున్నాడు. ఇంతలో అతని తల్లి చేసిన ఫోను అతనికి ప్రాణం పోసింది. 

వివరాల్లోకి వెళితే సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న ప్రవీణ్ ఠాక్రే (28) సింహగఢ్ కోటను చూడటానికి వెళ్లాడు. అలా కోట అందాలను ఫోటోలు తీసుకుంటూ ఉండిపోయాడు. అలా ఫోటోలు తీస్తూ ప్రమాదవశాత్తు కోటలో ఉండే విండ్ పాయింట్ నుంచి 100 అడుగుల లోయలో పడిపోయాడు. అలాపడిన ప్రవీణ్ ను ఎవ్వరూ గమనించలేదు. అలా లోయలోంచి ఎలా బైటపడాలో తెలీక గాయపడిన నిస్సహాయస్థితిలో  అలా ఉండిపోయాడు. ఈ క్రమంలో నాగ్ పూర్ లో ఉంటున్న ప్రవీణ్ తల్లి  ప్రతీరోజు రాత్రి 9 గంటలకు ప్రవీణ్ కు ఫోన్ చేస్తూంటుంది. ఆరోజు కూడా కొడుకు ఫోన్ చేసింది. 

తల్లి నుంచి ఫోన్ రావటంతో అమ్మా..నేను లోయలో పడిపోయాను..పిలిచినా ఎవ్వరూ పలకటంలేదని చెప్పాడు. దీంతో ఆమె కంగారుపడిపోయింది.కొడుకుకు ఏమైపోయిందననీ గాబరాపడిపోయింది. వెంటనే బంధువులకు, ప్రవీణ్ ఫ్రెండ్స్ కు ఫోన్ చేసింది. ప్రవీణ్ సోదరి వెంటనే ఫ్లైట్ లో బయలుదేరి తన స్నేహితులతో పాటు కోట వద్దకు చేరుకుని వెతకం ప్రారంభించింది. మంచు దట్టంగా ఉండటంతో ప్రవీణ్ ఉన్న లోయను గుర్తించలేకపోయారు.

దీంతో స్థానికుల సహాయాన్ని కోరింది. వారు లోయ దగ్గరకు వెళ్లారు. కానీ ప్రవీణ్ ను లోయనుంచి ఎలా తీసుకురావాలో తెలీయలేదు. దీంతో పర్వతారోహణ క్లబ్‌ కు ఫోన్ చసి విషయం చెప్పారు. దాంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని స్థానికులు సహాయంతో ప్రవీణ్ ను సురక్షితంగా బయటకు తీశారు.అలా ఎట్టకేలకూ ప్రవీణ్ లోయ నుంచి బైటకు తీసుకుకొచ్చి వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లి గాయాలకు ట్రీట్ మెంట్ చేయించారు. ప్రవీణ్ ప్రస్తుతం బాగానే ఉన్నాడనీ ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్ ప్రశాంత్ గైక్వాడ్ తెలిపారు.