Bariatric surgery for Dog: దేశంలోనే తొలిసారి కుక్కకు బేరియాట్రిక్ సర్జరీ..1.20 లక్షలు ఖర్చు చేసిన యజమాని

పూణెలో ఓ కుక్కకు బేరియాట్రిక్ సర్జరీ చేశారు. భారత్ లోనే మొదటిసారి కావటం విశేషం. ఆకుక్కకు ఈ ఆపరేషన్ చేయించటానికి దాని యజమాని రూ.1.20లక్షలు ఖర్చు పెట్టారు.

Bariatric surgery for Dog: దేశంలోనే తొలిసారి కుక్కకు బేరియాట్రిక్ సర్జరీ..1.20 లక్షలు ఖర్చు చేసిన యజమాని

Bariatric Surgery For Dog (1)

dog gastrectomy weight loss surgery : కుక్కలు బొద్దుగా ఉంటే చూడటానికి భలే ముద్దుగా ఉంటాయి. కానీ కొవ్వు బాగా పెరిగిపోయి కదల్లేకుండా ఉంటే పాపం వాటికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.అలా పాపం ఓ కుక్క బాగా బరువు పెరిగిపోయింది. ఎంతగా అంటే..కదల్లేకుండా ఉండే పరిస్థితి. అలా 50కిలోల బరువు పెరిగిపోయిన ఓ కుక్క కదల్లేకుండా నానా యాతన పడుతోంది. దీంతో ఆకుక్క యజమాని దానికి రూ.1.20 లక్షలు ఖర్చు పెట్టి మరీ బేరియాట్రిక్ సర్జరీ చేయించాడు. బేరియాట్రిక్ సర్జరీ అంటే అధిక బరువును తగ్గించటానికి చేసే ఆపరేషన్ అంటారు.

అలా ఓ కుక్కకు బేరియాట్రిక్ సర్జరీ చేయటం భారత్ లోనే మొదటిసారి కావటం విశేషం.బేరియాట్రిక్ సర్జరీ అనేది స్థూలకాయంతో బాధపడుతున్న వారికి చేసి వారి శరీర బరువును తగ్గిస్తారనే విషయం తెలిసిందే. అలా బరువును తగ్గించుకోవటంకోసం చాలామంది ఈ సర్జరీ చేయించుకుంటారు. కానీ కుక్కలకు ఇటువంటి సర్జరీ చేయటం..దాని కోసం లక్ష రూపాయలకు పైగా ఖర్చు పెట్టటం వింతే మరి. దేశంలోనే తొలిసారి పూణెలో ఓ కుక్కకు డాక్టర్లు బేరియాట్రిక్ సర్జరీ చేశారు.

పూణెకు చెందిన యాస్మిన్ దారువాలా అనే వ్యక్తి ఓకుక్కను పెంచుకుంటున్నారు.8 ఏళ్ల 6 నెలల వయసు. దానికి ‘దీపిక’ అని పేరు పెట్టుకుని సొంతమనిషిలా పెంచుకుంటున్నారు. దీపిక బొద్దుగా తయారు కావటం చూసి మురిసిపోయేవారు. కానీ అది రోజురోజుకు బరువు పెరిగిపోతుండటంతో ఆందోళన చెందారు. దీపిక అలా ఏకంగా 50 కిలోలు బరువుకు పెరిగిపోయింది. పాపం దీంతో దీపిక నడవలేకపోయేది. అంతేకాదు దానికి అధిక బరువుతో కిడ్నీ, కార్డియాక్, లివర్, హై బీపీ వంటి సమస్యలు చుట్టుముట్టటంతో పాపం అది కదల్లేకపోయేది.కనీసం ఊపిరి తీసుకోవటానికి కూడా ఇబ్బంది పడిపోయేది.దాని బాధ చూడలేకపోయేది యజమాని కుటుంబం. పశువుల డాక్టర్ల వద్దకు తీసుకెళ్లి. రూ.10,000లు ఖర్చుపెట్టారు.కానీ ఫలితంలేదు.

దీంతో ఆందోళన చెందిన యాస్మిన్ జంతు వైద్య నిపుణులకు చూపించి ఏదోకటి చేసి మా దీపికను మాకు దక్కించండీ..దాని బాధ చూడలేకపోతున్నాం అంటూ వాపోయారు.
‘దీపిక’ను పరీక్షించిన నిపుణులు దానికి బేరియాట్రిక్ సర్జరీ చేయించాలని చెప్పారు. ఖర్చు కూడా బాగానే అవుతుందని చెప్పారు. దీంతో యాస్మిన్ ఏమాత్రం ఆలోచించలేదు. ‘దీపిక’కు రూ. 1.20 లక్షల ఖర్చు పెట్టి ల్యాప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ ఆపరేషన్ చేయించారు.

పూణేలోని లాపరో ఒబెసో సెంటర్‌లోని ప్రముఖ లాపరోస్కోపిక్ బారియాట్రిక్ సర్జన్ డాక్టర్ శశాంక్ షా, వెటర్నరీ సర్జన్..స్మాల్ యానిమల్ క్లినిక్ వ్యవస్థాపకుడు డాక్టర్ నరేంద్ర పర్దేషి నాయకత్వంలో ఆ కుక్కకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు దానిలో పేరుకుపోయి 5 కిలోల అదనపు కొవ్వును తొలగించారు. ఫలితంగా శునకం బరువు 45 కిలోలకు చేరుకుంది. ఆపరేషన్ తరువాత ‘దీపిక’ కోలుకుంది. ఇప్పుడు నడవగలుగుతోంది. గతంలోలాగా తన దీపిక నడుస్తుండటం చూసి యాస్మిన్ దంపతులు మురిసిపోయారు.

ఈ సందర్భంగా డాక్టర్ పర్దేషి మాట్లాడుతూ సాధారణంగా కుక్కల ఆయుర్ధాయం 12 నుంచి 15 ఏళ్లు. కానీ ఊబకాయం వస్తే వాటి ఆయుషు కూడా తగ్గిపోతుందని ఆరు సంవత్సరాల ఆయుర్ధారం తగ్గిపోతుందని తెలిపారు. కానీ దీపిక అనే కుక్కకు సరైన సమయంలో సర్జీరీ చేయటంతో దానికి ఇబ్బంది తప్పిందని తెలిపారు.