కరోనా వ్యాక్సిన్ టెస్టింగ్ కోసం NIVకి 30 కోతులు

  • Published By: nagamani ,Published On : June 3, 2020 / 06:39 AM IST
కరోనా వ్యాక్సిన్ టెస్టింగ్ కోసం NIVకి 30 కోతులు

కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన తయారు చేయటానికి ప్రపంచంలోని సైంటిస్టులంతా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈక్రమంలో పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) కూడా కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైంది.  ఈ క్రమంలో వారు తయారు చేసిన టీకాను పరీక్షించడానికి అటవీశాఖ నుండి 30 కోతులు కావాల‌ని ఎన్ఐవి ప్రభుత్వాన్ని  కోరింది. దీనికి ప్రభుత్వ పర్మిషన్ కూడా లభించింది. దీంతో అటవీశాఖ వారు  కోవిడ్ -19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ కోసం 3 నుంచి 4 ఏళ్ల‌ మధ్య వ‌య‌సు గ‌ల 30 కోతులను ఎన్ఐవికి అట‌వీశాఖ అప్ప‌గించ‌నుంది.  

ఈ కోతులు పూణే జిల్లాలోని వడ్గావ్ అడవి ప్రాంతం నుంచి తీసుకురానున్నారు. కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను మొదట కోతులపై  పరీక్షిస్తార‌ని..దీని కోసం ప్రభుత్వం అనుమతి మేరకు కోతులను పంపనున్నామని రాష్ట్ర అటవీ మంత్రి సంజయ్ రాథోడ్ తెలిపారు. దీనికి అటవీశాఖ అధికారులు కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. తాము ఇచ్చిన ఆ కోతులను ఎన్‌ఐవి జాగ్ర‌త్త‌గా చూసుకోవాలని షరతు పెట్టామని తెలిపారు.  

కాగా..దేశంలోని కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలలో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంది. ఈ క్రమంలో గత 24 గంటల్లో 103 మంది కరోనాతో మరణించారు. కొత్తగా 2 వేల 287 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా సోకిన వారి సంఖ్య 72,300కు చేరింది. ఇక్కడ కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 2వేల 465 మంది మృతి చెందారు. ఈ మొత్తం మరణాలలో ముంబైలోనే అధికంగా ఉన్నాయి. 

Read: ఐడియా అదిరింది…ప్రయాణంలో వైరస్ నుంచి రక్షణ