Pune : భార్యతో కలిసి ఉంటే ఎమ్మెల్యే కాలేవన్న జ్యోతిష్కుడు..ఆ భర్త ఏంచేశాడంటే..

Pune Palm reader advises man to divorce his wife : ఈ కంప్యూటర్ కాలంలో కూడా మూఢనమ్మకాలతో చాలామంది జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. జాతకాలు..శాంతులు అంటూ జ్యోతిష్కాలు చెప్పించుకుంటూ కుటుంబాలల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. అలా మహారాష్ట్రలో ఓ వ్యక్తి జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి పచ్చని కాపురంలో నిప్పులు పోసుకున్నాడు. ఎలాగైనా సరే ఎమ్మెల్యే అవ్వాలని..ఆ తరువాత మంత్రి కూడా అయిపోవాలని కోరిక. దాని కోసం రాజకీయ పార్టీల నాయకులతో సహవాసాలు చేస్తుంటాడు. కానీ ఎమ్మెల్యే కావటం అంటే కాస్త రాజకీయ పలుకుబడితో పాటు చేతినిండా డబ్బులు కూడా కావాలిగా..కానీ అదంతా నాకు తెలియదు..నేను ఎమ్మెల్యే అయిపోవాలంతే..అదే ధ్యాసతో ఓ జ్యోతిష్యుడిని కలిసి అతను చెప్పిన మాటలు నమ్మి పచ్చని కాపురంలో కలతలు రేపుకున్నాడు. ఆఖరికి భార్యకు విడాకులు ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు.ఇంతకీ ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడు? అతనే చేశాడంటే..
పూణే పట్టనానికి చెందిన రఘునాథ్ ఏముల్ కు ఎమ్మెల్యే అయిపోయి..ఆ తరువాత మంత్రి కూడా అవ్వాలని కోరిక. అది కోరికఅనేకంటే పిచ్చి పీక్స్ అనొచ్చు. అలా ఎమ్మెల్యే కావాలంటే ఏం చేయాలని..పూజలు, హోమాలు చేయాలా?అసలు తన జాతకంలో ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉందా? అని ఓ జ్యోతిష్యుడి వద్దకెళ్లాడు. నా హస్త రేఖలు చూసి తనకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉందా? అంటూ జాతకం చెప్పమన్నాడు.
అబ్బా భలే దొరికాడు బకరా అనుకున్న ఆ జ్యోతిష్యుడు (అందరి జాతకాలు చెప్పేస్తానని అనుకునే వ్యక్తి) వ్యక్తి పేద్ద అందరి జాతకాలు తెలిసినట్లుగా బిల్డప్ ఇచ్చాడు.దానికి రఘునాత్ చెయ్యిని అటూ ఇటూ తిప్ప చూసి..ఓ ‘నువ్వు ఎమ్మెల్యే అవతావు..కానీ కాస్త అండ్డంకులు ఉన్నాయోయ్..దానికి కారణం నీ భార్యే’ అని చెప్పాడు. నీ భార్య నీ ఇంట్లో ఉండగా నువ్వు ఎప్పటికీ నీ కలను సాకారం చేసుకోలేవని..నువ్వు ఎమ్మెల్యేవు కాలేవు..నీ భార్య జాతకం మంచిది కాదు..ఆమెకు విడాకులు ఇస్తేనే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది’ అంటూ సలహా ఇచ్చాడు.
అంతే అతను చెప్పే మాటలు నమ్మేశాడు రఘునాథ్. అంతే ఇక అప్పటి నుంచి భార్యకు నరకం చూపెట్టటం ప్రారంభించాడు. తల్లిదండ్రులతో కలిసి భార్యను వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. ఇష్టమొచ్చినట్లుగా తిట్టటం..కొట్టటం ఇలా రకరకాలుగా వేధించేవాడు. అతనికి తల్లిదండ్రులు వంత పాడేవారు.దరిద్రపుదానా..నీ దరిద్రపు జాతకం వల్ల నా కొడుకు అనుకున్నది సాధించలేకపోతున్నాడు..ఛావు’ అంటూ కొట్టేవారు.
భర్త, అత్తామామ వేధింపులతో విసిగిపోయిన భార్య.. తనను వేధింపులకు గురిచేస్తున్నారని పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి విచారించారు. దీంతో జరిగిన విషయం మొత్తం వెలుగులోకి వచ్చింది. దీంతో సదరు జ్యోతిష్కుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి సలహాలు చెప్పి కుటుంబాల్లో గొడవలు పెడుతున్నావు..అంటూ తమదైన శైలిలో ట్రీట్ మెంట్ ఇచ్చారు. జ్యోతిష్యుడు మాటలు నమ్మి రఘునాథ్ ఇలా భార్యను వేధించటం మొదలు పెట్టాడని..జ్యోతిష్కుడిని కూడా అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని.. పూణే పోలీసు కమిషనర్ అమితాబ్ గుప్తా తెలిపారు.
- navneet kaur: మహారాష్ట్రలో ఎంపీ, ఎమ్మెల్యే దంపతుల అరెస్టు
- Daughter : అమ్మాయి పుట్టడంతో ఆనందపడుతున్న కుటుంబం..పసిపాపను హెలికాప్టర్లో ఇంటికి తీసుకొచ్చిన తండ్రి
- Maharashtra : 60 వేల మందికి చుక్కలు చూపించిన పిల్లి..! ఏకంగా రూ.100 కోట్ల నష్టం..!!
- Maharashtra : రైతుల భక్తి.. 2,000 కిలోల ద్రాక్షపండ్లతో గణేషుడికి అలంకరణ
- Student Letter : ఆలేరు మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థిని లేఖ కలకలం
1Virender Sehwag: అతను తిరిగొస్తే టెస్ట్ క్రికెట్‌కు ఎగ్జైట్మెంట్ వస్తుంది – వీరేంద్ర సెహ్వాగ్
2Biden Offer Kim : నార్త్ కొరియాకు బైడెన్ ఆఫర్.. కిమ్ నిజాయితీగా ఉంటే కలిసేందుకు రెడీ..!
3Ex Minister Vs MLA: నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి జూపల్లి వర్సెస్ ఎమ్మెల్యే అనుచరులు
4Death Penalty: సొంత చెల్లెలి పరువు హత్య.. ముగ్గురికి మరణ శిక్ష
5KCR Delhi Tour : ఢిల్లీలో కేసీఆర్.. మొహల్లా క్లినిక్, సర్వోదయ స్కూల్ సందర్శన
6Cyber Crime: అనకాపల్లిలో సైబర్ మోసం: కరోనా పరిహారం అంటూ రూ. 90 వేలు కాజేసిన మాయగాళ్లు
7Cultivation Of Orchards : పండ్ల తోటల సాగులో మెలుకువలు
8Monkeypox cases : 11 దేశాల్లో 80 మంకీపాక్స్ కేసులు.. అయినా ఆందోళనక్కర్లేదు.. నిపుణుల సూచన!
9Pakka Commercial: ముహూర్తం పెట్టేసిన మారుతీ-గోపీచంద్.. హిట్ కొడతారా?
10Vikram: హైప్ పెంచుతున్న కమల్.. స్పీడందుకున్న ప్రమోషన్స్!
-
Oatmeal Packs : చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేసే ఓట్స్ ప్యాక్స్!
-
CM KCR in Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ: ఎస్పీ అధినేత అఖిలేష్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ
-
Hyderabad Weather: హైదరాబాద్‌లో ఒక్కసరిగా మారిపోయిన వాతావరణం
-
ATM Withdraw Money : ఏటీఎంలో డెబిట్, క్రెడిట్ కార్డు లేకుండానే డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు!
-
Karnataka Uncertainty: ముస్లిం విద్యార్థులను మతపరమైన పాఠశాలలో చేర్పించాలంటూ దుబాయ్ నుంచి తల్లిదండ్రులకు కాల్స్
-
CHILDREN FOOD : పిల్లలు అరోగ్యంగా ఎదిగేందుకు ఎలాంటి ఆహారం అవసరం?
-
Lightning Strikes: బీహార్‌లో పిడుగు పాటుకు గురై 33 మంది మృతి: విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
-
Rahul Gandhi: లండన్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు