రాత్రి వేళ కర్ఫ్యూ, స్కూళ్లు కాలేజీలు క్లోజ్

రాత్రి వేళ కర్ఫ్యూ, స్కూళ్లు కాలేజీలు క్లోజ్

Shut

Pune Schools, Colleges : కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తగ్గిపోతుందన్న క్రమంలో..వైరస్ కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని, జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో..కఠిన నిబంధనలు, ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రధానంగా మహారాష్ట్ర, కేరళతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో లాక్ డౌన్ విధిస్తున్నారు.

తాజాగా..రాత్రి వేళ కర్ఫ్యూని మార్చి 14 వరకు పొడిగించాలని పూణె జిల్లా అధికారులు డిసైడ్ అయ్యారు. అత్యవసర సేవలను మినహాయించారు. 2021, ఫిబ్రవరి 28వ తేదీ ఆదివారంతో కర్ఫ్యూ ముగియాల్సి ఉంది. దీనిని మరో 15 రోజులు పొడిగించారు. అప్పటి వరకు స్కూళ్ళు, కాలేజీలు బంద్ ఉంటాయని పూణె మేయర్ మురళీధర్ మోహోల్ వెల్లడించారు.

రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. ఇక పూణె విషయానికి వస్తే..ఇప్పటి వరకు 4 లక్షల 6 వేల 453 కేసులు నమోదయ్యాయి. 3 లక్షల 87 వేల 527 మంది రికవరీ అయ్యారు. శనివారం 9 వేల 860 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 8 వేల 623 కొత్త కేసులు నమోదు కాగా..51 మంది మరణించారు. మొత్తంగా 52 వేల 092 మంది చనిపోయారు. 21 లక్షల 46 వేల 777 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 73 వేల 734 మంది రికవరీ అయ్యారు.