పూణేలో వారం రోజులు మినీ లాక్ డౌన్

మహారాష్ట్రలో కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ముంబై,పూణే,నాగ్ పూర్ వంటి సిటీల్లో కరోనా ప్రభావం అధికంగా ఉంది.

పూణేలో వారం రోజులు మినీ లాక్ డౌన్

Pune To Go Under Mini Lockdown From Tomorrow

Pune మహారాష్ట్రలో కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ముంబై,పూణే,నాగ్ పూర్ వంటి సిటీల్లో కరోనా ప్రభావం అధికంగా ఉంది. పూణేలో గత మూడు రోజులుగా 8వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పూణే జిల్లా యంత్రాంగం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. శనివారం(ఏప్రిల్-3,2021)నుంచి వారం రోజుల పాటు 12గంటల నైట్ కర్ఫ్యూ విధించాలని పూణే జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది.

సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6గంటల వరకు(12గంటల పాటు)వారం రోజుల పాటు నైట్ కర్ఫ్యూని విధిస్తున్నామని పూణే డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావ్ తెలిపారు. బార్లు,హోటల్స్,మాల్స్ మూసివేయబడతాయని ఆయన తెలిపారు. ఈ కర్ఫ్యూ సమయంలో కేవలం ఫుడ్,మెడిసిన్స్ మరియు ఇతర అత్యవసర సర్వీసులను మాత్రమే హోం డెలివరీకి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. పెళ్లి లేదా అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు తప్ప ఎటువంటి బహిరంగ వేడుకలకు అనుమతి లేదని తెలిపారు. పెళ్లి కార్యక్రమానికి అయితే గరిష్ఠంగా 50మంది,అంత్యక్రయలకు గరిష్ఠంగా 20మందికి మాత్రమే పాల్గొనేందుకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆదేశాలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయన్నారు.

ఇక, పూణే జిల్లాలోని అన్ని ప్రార్థనా మందిరాలు వచ్చే ఏడు రోజులు పూర్తిగా మూసివేయబడతాయని సౌరభ్ రావ్ తెలిపారు. స్కూల్స్,కాలేజీలు మరియు ఇతర విద్యాసంస్థలు ఏప్రిల్-30వరకు మూసివేయబడి ఉంటాయని చెప్పారు.

మరోవైపు,కోవిడ్-19 రోగుల కోసం 80శాతం బెడ్లు అందుబాటులో ఉంచాలని పూణే మేయర్ మురళీధర్ మొహోల్ ప్రైవేట్ హాస్పిటల్స్ ను ఆదేశించారు. ప్రస్తుతం లాక్ డౌన్ విధించాల్సిన తీవ్రమైన అవసరం లేదని,దానికి బదులుగా టెస్టింగ్,ట్రేసింగ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పెంచితే సరిపోతుందని ఆయన తెలిపారు.