Puneeth Rajkumar కు గుండెపోటు ఎలా వచ్చిందో చెప్పడం అసాధ్యం

46ఏళ్ల పునీత్, ఫిట్ నెస్ స్టార్ పునీత్.. గుండెపోటుతో చనిపోయాడు అంటే అస్సలు నమ్మలేకపోతున్నారు. నిత్యం జిమ్ లో కసరత్తులు, రెగులర్ గా వ్యాయామం చేసే పునీత్ కు గుండెపోటు రావడం ఏంటని..

Puneeth Rajkumar కు గుండెపోటు ఎలా వచ్చిందో చెప్పడం అసాధ్యం

Puneeth Rajkumar

Puneeth Rajkumar : కన్నడ ‘పవర్‌స్టార్‌’ పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. వ్యాయామం చేస్తూ గుండెపోటు శుక్రవారం పునీత్‌ మరణించడాన్ని సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు, అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ రాజ్‌కుమార్‌ అకాల మరణం ఎంతో మందికి తీరని శోకం మిగిల్చింది. అభిమానులు, కుటుంబసభ్యులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. వాళ్లు ఇంకా షాక్ లోనే ఉన్నారు. 46ఏళ్ల పునీత్, ఫిట్ నెస్ స్టార్ పునీత్.. గుండెపోటుతో చనిపోయాడంటే అస్సలు నమ్మలేకపోతున్నారు. నిత్యం జిమ్ లో కసరత్తులు, రెగులర్ గా వ్యాయామం చేసే పునీత్ కు గుండెపోటు రావడం ఏంటని విస్తుపోతున్నారు.

కాగా, పునీత్ గుండెపోటుకు సంబంధించి ఆయన ఫ్యామిలీ డాక్టర్ రమణారావు కీలక విషయాలు వెల్లడించారు. పునీత్‌ ఎంతో ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేవారని.. ఆయనకు గుండెపోటు రావడానికి గల కారణాలు చెప్పడం అసాధ్యమని తెలిపారు. శుక్రవారం పునీత్‌ తన దగ్గరికి ఎలా వచ్చారో.. అక్కడ ఏం జరిగిందో ఆ డాక్టర్ వెల్లడించారు.

Covid-19 Origins : కొవిడ్ పుట్టుక.. వైరస్ మూలాలను ఎప్పటికీ గుర్తించ‌లేం.. జీవాయుధం కానేకాదు!

‘నలతగా ఉందంటూ భార్య అశ్వినితో కలిసి పునీత్‌ నన్ను సంప్రదించారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే ఆయన నుంచి ఇలాంటి మాటలు నేనెప్పుడూ వినలేదు. పలు పరీక్షలు చేశా. ఆయన బీపీ సాధారణంగానే ఉంది. గుండె స్థిరంగా కొట్టుకుంది. ఊపిరితిత్తుల్లోనూ ఎలాంటి సమస్యా లేదు. కానీ, చెమటలు కారిపోతున్నాయి. అయితే వ్యాయామం తర్వాత ఇది సాధారణమేనని ఆయన చెప్పారు. ఎందుకైనా మంచిదని ఈసీజీ పరీక్ష చేశా. అందులో ఓ స్ట్రెయిన్‌ను గుర్తించా. వెంటనే అన్ని రకాల వైద్య సౌకర్యాలున్న స్థానిక విక్రమ్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాలని అశ్వినికి సూచించా. వారు కారు ఎక్కగానే విక్రమ్‌ ఆసుపత్రికి కాల్‌ చేసి ఐసీయూ సిద్ధం చేయాలని సూచించాను. అలా చెప్పిన ఐదారు నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకున్నప్పటికీ ఆయనను బతికించుకోలేకపోయాం’ అని రమణారావు తెలిపారు.

Disease Attack : యువతపై జబ్బుల దాడి… చిన్న వయస్సులోనే మరణం అంచులకు..

పునీత్‌ గురించి ఆ డాక్టర్ మరిన్ని విషయాలు తెలిపారు. ‘ఆరోగ్యం పట్ల అప్పూ ఎంతో శ్రద్ధ వహించేవారు. పునీత్‌ను చూసి నేర్చుకోవాలని ఎంతో మందికి సలహాలు ఇచ్చేవాడిని. ఇదో హఠాత్పరిణామం. ఇది గుండెపోటు కాదు (గుండెకు రక్త ప్రసరణ ఆగిపోవడం). కార్డియాక్ అరెస్ట్ (గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోవడం). ఈ కార్డియాక్ అరెస్ట్‌కు దారితీసే అంశాలు చాలానే ఉంటాయి. కానీ అప్పు విషయంలో ఇవేవీ కనిపించ లేదు. ఆయనకు షుగర్, అసాధారణ రక్తపోటు లాంటివి ఏమీ లేవు. అప్పూ విషయంలో ఏం జరిగిందో కచ్చితంగా చెప్పడం అసాధ్యం’ అని అన్నారు.

పునీత్ రాజ్‌కుమార్ పార్థివదేహానికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. పునీత్ భౌతిక కాయానికి నివాళి అర్పించిన బొమ్మై.. శనివారం జరగాల్సిన అంత్యక్రియలను ఆదివారానికి వాయిదా వేశామన్నారు. పునీత్ కూతురు న్యూయార్క్ నుంచి రావాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

కాగా, పునీత్‌ను చివరిసారి చూడటానికి వేల సంఖ్యలో ఫ్యాన్స్‌తోపాటు సెలబ్రిటీలు కంఠీరవ స్టేడియానికి క్యూ కట్టారు. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, నరేశ్, ప్రభుదేవా, శివాజీలు పునీత్‌‌‌కు నివాళి అర్పించారు. పునీత్ పార్థివదేహాన్ని చూసి బాలయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు.