Punjab assembly polls: పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించనున్న కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పంజాబ్ సీఎం అభ్యర్థి పేరు ప్రకటించనున్నారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు యావత్..

Punjab assembly polls: పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించనున్న కేజ్రీవాల్

Arvind Kejriwal

Punjab assembly polls: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పంజాబ్ సీఎం అభ్యర్థి పేరు ప్రకటించనున్నారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు యావత్ దేశమంతా సంచలనంగా మారాయి. ఈ క్రమంలో  మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు కేజ్రీవాల్ చేయనున్న ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.

గత వారమే దీని గురించి అరవింద్ కేజ్రీవాల్ హింట్ ఇచ్చారు. ఫిబ్రవరి 14న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థి పేరు ముందుంచుతామని చెప్పారు. ఈ పోటీ జాబితాలో తాను లేనని ముందుగానే చెప్పారు కేజ్రీవాల్.

అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో వినూత్నంగా ఆలోచించారు. ఆప్ పంజాబ్ యూనిట్ చీఫ్, సంగ్రూర్ ఎంపీ, సీనియర్ పార్టీ లీడర్ రాఘవ్ చద్దా సమక్షంలో ఢిల్లీ సీఎం 7074870748మొబైల్ ను లాంచ్ చేశారు. జనవరి 17 సాయంత్రం 5గంటల వరకూ ఎవరు కావాలనే దానిపై ఒపీనియన్ పోల్ అడిగారు. తమ ఓట్ ను వాయీస్ లేదా టెక్స్ట్ మెసేజ్ రూపంలో పంపొచ్చని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: పరిస్థితి అదుపులోనే ఉంది.. లాక్‌డౌన్ అవసర్లేదు

గతేడాది ప్రచార సమయంలో పంజాబ్ 2022 అసెంబ్లీ పోల్స్ లో పాల్గొనే సీఎం అభ్యర్థి కచ్చితంగా సిక్ కమ్యూనిటీకి చెందిన వారే అయి ఉంటారని అన్నారు. ప్రస్తుత పంజాబ్ ఎలక్షన్ ఫిబ్రవరి 14న జరగనుండగా మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.