Punjab CM Mann: అప్పుడే కేంద్రంపై కాలు దువ్వుతున్న పంజాబ్ కొత్త సీఎం

సీఎం సీటులో కూర్చుని పది రోజులు కూడా దాటలేదు..అప్పుడే కేంద్రంపై కాలు దువ్వుతున్నారు భగవంత్ మన్. కేంద్ర ప్రభుత్వ విధానాలపై భగవంత్ మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు

Punjab CM Mann: అప్పుడే కేంద్రంపై కాలు దువ్వుతున్న పంజాబ్ కొత్త సీఎం

Bhagawant

Punjab CM Mann:  పంజాబ్ రాష్ట్ర కొత్త సీఎంగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన భగవంత్ మన్..సీఎంగా తన మార్క్ ప్రదర్శనకు దిగారు. సీఎం సీటులో కూర్చుని పది రోజులు కూడా దాటలేదు..అప్పుడే కేంద్రంపై కాలు దువ్వుతున్నారు భగవంత్ మన్. చండీగఢ్ అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు చేకూర్చుతున్నామంటూ ఇటీవల హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై సోమవారం పంజాబ్ సీఎం భగవంత్ మన్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై భగవంత్ మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్‌లో ఇతర రాష్ట్రాలు మరియు ప్రభుత్వశాఖల నుండి వచ్చిన అధికారులు మరియు సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం దశలవారీగా నియమించుకుంది. ఇది పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 1966 యొక్క లేఖ మరియు స్ఫూర్తికి విరుద్ధం. చండీగఢ్‌పై తన న్యాయమైన దావా కోసం పంజాబ్ బలంగా పోరాడుతుంది… (sic),” అని మన్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also read:Bharat Bandh : కొనసాగుతున్న భారత్ బంద్.. బ్యాంకు, ఏటీఎంలపై ఎఫెక్ట్!

చండీగఢ్‌పై తమకున్న హక్కు కోసం పంజాబ్ ప్రభుత్వం గట్టిగా పోరాడుతుందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగులకు తాయిలాలు ఇవ్వాలంటూ గత కొన్ని రోజులుగా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలో వారి డిమాండ్లపై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకుని..ప్రయోజనాలు చేకూర్చనున్నారని ఆదివారం అమిత్ షా ప్రకటించారు. “యూనియన్ టెరిటరీలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు ఇప్పుడు 58 నుండి 60 సంవత్సరాలకు పెరుగుతుంది మరియు మహిళా ఉద్యోగులకు ప్రసూతి, పిల్లల సంరక్షణ సెలవులు ఇప్పుడు ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాలకు పెరుగుతుంది. అంటూ అమిత్ షా వెల్లడించారు.

Also read:Srilanka – India: శ్రీలంక ఆర్ధిక మంత్రిని కలిసిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్

అయితే అమిత్ షా ప్రకటనపై పంజాబ్ లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ సహా..కాంగ్రెస్, అకాళీదళ్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులను విడగొట్టి.. వారి ప్రయోజనాలను కేంద్రం హరిస్తుందని వారు అన్నారు. పంజాబ్ ఎన్నికల ఫలితాన్ని చూసి బీజేపీ భయపడే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు బీజేపీని ఎద్దేవాచేశారు. “2017 నుంచి 2022 వరకు పంజాబ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. అమిత్ షా అప్పటికి చండీగఢ్ అధికారాలను తీసుకోలేదు. పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే అమిత్‌ షా చండీగఢ్‌ సేవలను లాక్కెళ్లారు’ అని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా ట్వీట్‌ చేశారు.

Also read:Gujarat : కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రక్షాళన.. టీంలోకి కొత్తగా 200 మంది