Punjab CM : ఎమ్మెల్యేల పెన్షన్‌‌పై సీఎం షాకింగ్ నిర్ణయం.. కేవలం ఒకే ఒక్క టర్మ్ మాత్రమే

కొందరు ఎమ్మెల్యేలకు రూ. 3.50 లక్షలు, రూ. 5.25 లక్షల వరకు పెన్షన్ తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పెను భారం పడుతోందని తెలిపారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారి గెలిచినా.

Punjab CM : ఎమ్మెల్యేల పెన్షన్‌‌పై సీఎం షాకింగ్ నిర్ణయం.. కేవలం ఒకే ఒక్క టర్మ్ మాత్రమే

Punjab

Punjab EX MLA Pension : సామాన్యుడి పాలన ఎలా ఉంటుందో చేసి చూపిస్తామన్న ఆప్.. అనుకున్నట్లుగానే పంజాబ్ లో కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందు.. చేసిన తర్వాత వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం భగవంత్ మాన్. కీలక ప్రకటనలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్న ఈయన మరో ప్రకటన చేసి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఈయన తీసుకున్న నిర్ణయానికి ప్రతిపక్షాలు సైతం జై కొడుతున్నాయంటే ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అర్థమౌతోంది. తాజాగా మరోక కీలక ప్రకటన చేశారు సీఎం భగవంత్ మాన్. ఎమ్మెల్యేల పెన్షన్ విషయంలో తీసుకున్న నిర్ణయానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆయన సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారారు. ఇక నుంచి మాజీ ఎమ్మెల్యేలకు ఒకే ఒక్క టర్మ్ మాత్రమే పెన్షన్ అందచేస్తామని, చాలా మంది ఎమ్మెల్యేలు లక్షల్లో పెన్షన్ తీసుకుంటున్నారనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

Read More : Free Ration : ఉచిత రేషన్ పథకం పొడిగింపు.. ఎన్ని నెలలంటే

కొందరు ఎమ్మెల్యేలకు రూ. 3.50 లక్షలు, రూ. 5.25 లక్షల వరకు పెన్షన్ తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పెను భారం పడుతోందని తెలిపారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారి గెలిచినా లేదా రెండు, మూడు, నాలుగు గెలిచిన వారికి ఒక్క టర్మ్ లో మాత్రమే పెన్షన్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తికి నెలకు రూ. 75 వేల పెన్షన్ అందిస్తున్నారు. మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే.. పెన్షన్ డబ్బుకు అదనంగా మరో 66 శాతాన్ని అందచేస్తున్నారు. ఇది ప్రభుత్వ ఖజానాకు భారం అవుతోందని మాన్ తెలుసుకున్నారు. పంజాబ్ లో ప్రస్తుతం 250 మంది ఎమ్మెల్యేలు పెన్షన్ తీసుకుంటున్నట్లు అంచనా. అయితే.. పెన్షన్ విషయంలో శిరోమణి అకాళీదల్ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాశ్ సింగ్ బాదల్ ఇటీవలే కీలక ప్రకటన చేశారు. తనకు వచ్చే పెన్షన్ ను సామాజిక కార్యక్రమాలకు, బాలికలకు విద్యకు ఉపయోగించాలని ప్రభుత్వానికి సూచించారు. ఆయన పెన్షన్ తీసుకుంటే రూ. 5 లక్షలకు పైగానే వచ్చి ఉండేదని తెలుస్తోంది. తాజాగా పెన్షన్ విషయలో మాన్ తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ స్వాగతించింది.

Read More : Delhi Rozgar Budget 2022 : ఢిల్లీలో వచ్చే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం : కేజ్రీవాల్ సర్కార్ టార్గెట్!

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆఫ్ విజయదుందుభి మ్రోగించింది. 117 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఆప్ ఏకంగా 92 సీట్లలో విజయం సాధించింది. ఆప్ విజయం సాధించిన వెంటనే నయా పాలిటిక్స్ ప్రారంభమయ్యాయి. పంజాబ్‌లో సామాన్యుడి ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో చూపిస్తామంటూ హింట్ ఇస్తున్నారు. సీఎంగా పదవీ ప్రమాణం చేయకముందే రాష్ట్రంలో ఉన్న పలువురు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేల భద్రత తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాజ్‌భవన్ లో కాకుండా భగత్ సింగ్ గ్రామమైన ఖట్కర్ కలన్‌లో సీఎంగా ప్రమాణం చేస్తానని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన.. ఇక నుంచి గవర్నమెంటు ఆఫీసుల్లో సీఎం ఫొటోలు ఉండవని, షహీద్ భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటోలు ఉండాలని ఆదేశించడంతో జనం జేజేలు కొడుతున్నారు.