Punjab CM Charanjit Singh: రాజీనామాకు సిద్ధమైన పంజాబ్ సీఎం

పంజాబ్ చీఫ్ మినిష్టర్ చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ రాజీనామాకు సిద్ధమయ్యారు. పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ను కలిసి రాజీనామా లేఖను సమర్పింనున్నట్లు...

Punjab CM Charanjit Singh: రాజీనామాకు సిద్ధమైన పంజాబ్ సీఎం
ad

Punjab CM Charanjit Singh: పంజాబ్ చీఫ్ మినిష్టర్ చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ రాజీనామాకు సిద్ధమయ్యారు. పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ను కలిసి రాజీనామా లేఖను సమర్పింనున్నట్లు ఇండియా టుడే కథనంలో పబ్లిష్ అయింది. గురువారం ఉదయం తన అధికారిక నివాసానికి చేరుకున్నారు సీఎం చన్నీ.

పంజాబ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ జరుగుతుండగానే ఇలా జరగడం గమనార్హం. ముందుగా వెల్లడైన ఎగ్జిట్ ఫలితాల్లోనూ చరణ్ జిత్ సింగ్ పోటీ చేసిన చంకౌర్ సాహిబ్, భదౌర్ నియోజకవర్గాల్లో వెనుకంజలోనే ఉన్నారు.

ఇదిలా ఉంటే, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ సంబరాలు మొదలైపోయాయి. సీఎం అభ్యర్థి భగవత్ మన్ ఇంటి వద్ద సంప్రాదాయ నృత్యం బాంగ్రా డ్యాన్స్ చేస్తూ.. జిలేబీలు తయారుచేస్తూ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. ఇంటి నిండా పూలతో డెకరేట్ చేస్తూ.. పండుగ వాతావరణం కనిపిస్తుంది.

Read Also: పంజాబ్ లో టాప్ లేపుతున్న ‘ఆప్’..స్థానిక పార్టీలను ఊడ్చిపారేస్తోంది

117 సీట్లకు గానూ మ్యాజిక్ ఫిగర్ దాటేసి ఆప్ దూసుకుపోతుంటే బీజేపీ 5సీట్లకు కూడా చేరుకోలేకపోయింది. మరోవైపు కాంగ్రెస్ క్లీన్ బౌల్డ్ కాగా బీజేపీకి ఆప్‌లో సగం ఓట్లు కూడా దక్కలేదు.