High Alert : రాష్ట్రంలో హైఅలెర్ట్.. పోలీసులకు ఆదేశాలు జారీ

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. పంజాబ్ లో బాంబు పేలుడు ఘటన జరిగిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

10TV Telugu News

High Alert :  దేశంలో ఉగ్రవాద కదలికలు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో 6గురు ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ లో నలుగురు ఉగ్రవాదులను ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు దేశంలో మరో 14 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు.

Read More : Income Tax : సోనూ ఇంటికి మరోసారి ఐటీ అధికారులు

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ జిల్లాలో గత నెలలో జరిగిన పేలుడులో పాల్గొన్న పాక్ ఐఎస్ఐ మద్దతు ఉన్న నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసిన అనంతరం రాష్ట్రంలో పోలీసు బలగాలను సీఎం అప్రమత్తం చేసి హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. పంజాబ్ లో ఉగ్రవాదులు శాంత్రిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మార్కెట్లలో భద్రతను పెంచాలని డీజీపీని ఆదేశించారు.. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఖాసిమ్‌తో సహా ఇద్దరు ఉగ్రవాదులను కూడా గుర్తించారు.

Read More : ‘Namokar Mantra’: విద్యుత్ బల్బుపై ‘నమోకర్ మంత్రం’ చెక్కిన 70 ఏళ్ల వృద్ధుడు

సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించ‌డం ద్వారా ఉగ్రవాదులను అణచివేయాలని ముఖ్య‌మంత్రి అధికారుల‌కు ఆదేశాలు జారీచేశారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలు సమర్థిస్తున్నారు. రాజకీయాలకంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెబుతున్నారు. కాగా పాకిస్తాన్ తో సరిహద్దు కలిగి ఉండటంతో నిత్యం సరిహద్దు వద్ద ఉద్రిక పరిస్థితులు ఉంటాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ రాష్ట్రం గుండానే ఎక్కువగా డ్రగ్స్ సప్లై చేస్తుంటారు.

10TV Telugu News