Punjab : మాట్లాడుకోం…అంతే, క్షమాపణలు చెప్పాల్సిందే

మాటల్లేవ్‌.. మాట్లాడుకోవడాల్లేవ్‌.. అంటున్నారు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్. పీపీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విబేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య నెలకొన్న పరిస్థితి ఎవరికీ అర్థం కావడం లేదు.

Punjab : మాట్లాడుకోం…అంతే, క్షమాపణలు చెప్పాల్సిందే

Sidhu

Navjot Sidhu Without Apology : మాటల్లేవ్‌.. మాట్లాడుకోవడాల్లేవ్‌.. అంటున్నారు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్. పీపీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విబేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య నెలకొన్న పరిస్థితి ఎవరికీ అర్థం కావడం లేదు. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పీపీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. అమరీందర్ సింగ్ అభిప్రాయాన్ని పట్టించుకోని కాంగ్రెస్ అధిష్టానం సిద్ధూ చేతిలో పగ్గాలు పెట్టింది. దీనిని అమరీందర్ సింగ్ జీర్ణించుకోలేకపోతున్నారు. తనకు సిద్ధూ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని అమరీందర్ సింగ్ మీడియా సలహాదారు రవీన్ తుక్రాల్ మరోసారి స్పష్టం చేశారు.

Read More : Telangana Microsoft : తెలంగాణలో రూ.15వేల కోట్లతో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్

పీసీసీ చీఫ్‌గా నియమితులవడంతో కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో భేటీకి సిద్ధూ అపాయింట్‌మెంట్ కోరినట్లు వస్తున్న ప్రచారంపై రవీన్ తుక్రాల్ క్లారిటీ ఇచ్చారు. అమరీందర్‌ను కలిసేందుకు సిద్ధూ అపాయింట్‌మెంట్ కోరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. సిద్ధూ ఇప్పటివరకూ అపాయింట్‌మెంట్ కోరలేదని. అమరీందర్ సింగ్‌కు సిద్దూ బహిరంగ క్షమాపణలు చెప్పేంతవరకూ ఆయన్ను కలవరని తేల్చిచెప్పారు. సీఎంపై వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో అవమానకర రీతిలో సిద్ధూ దాడి చేశారని ఆరోపించారు. సిద్దూ క్షమాపణ చెప్పేంతవరకూ అమరీందర్ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.

Read More : బిగ్ ట్విస్ట్.. ఈటలతో కొండా భేటీ..!

పంజాబ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం టెస్ట్ సిరీస్‌లా కనిపిస్తోంది. పంచకులలో 2021, జూలై 21వ తేదీ బుధవారం సీఎం విందు ఏర్పాటు చేశారు. భోజనానికి పంజాబ్‌లోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలను సీఎం ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి సిద్ధూకు మాత్రం ఆహ్వానం పంపలేదు. దీంతో సీఎం విందు వ్యవహారం పంజాబ్‌ సంక్షోభాన్ని మరింత పెంచేలా ఆజ్యం పోస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎన్నికలకు ఇక ఏడాది కాలమే ఉండడంతో కాంగ్రెస్‌లో విభేదాలు ఇలా తారాస్థాయికి చేరడం పార్టీలో అలజడి రేపుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే అది కాంగ్రెస్‌కు నష్టం చేసే అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.