Charanjeet Singh : పంజాబ్ కాంగ్రెస్‌‌లో సంక్షోభం, అత్యవసర కేబినెట్ భేటీ

పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా తయారైంది. రోజుకోవిధంగా మారిపోతున్నాయి. సిద్ధూ రాజీనామా చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు గుస్సాగా ఉన్నారు.

10TV Telugu News

Punjab Congress : పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా తయారైంది. రోజుకోవిధంగా మారిపోతున్నాయి. సిద్ధూ రాజీనామా చేయడంపై కాంగ్రెస్Add New సీనియర్ నేతలు గుస్సాగా ఉన్నారు. పార్టీలో నెలకొన్న పరిస్థితులను సిద్ధూ అర్థం చేసుకోవడం లేదని మనీష్ తివారీ ఫైర్ అయ్యారు. సిద్ధూ రాజీనామా నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్ ను నియమించాలని కాంగ్రెస్ హై కమాండ్ యోచిస్తోందని సమాచారం. ప్రస్తుత పరిణామాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ అత్యవర కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. ఈ భేటీ అనంతరం మధ్యాహ్నం 12.30గంటలకు ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

Read More : Heavy Rains : మ‌హారాష్ట్ర‌ను ముంచెత్తిన వరదలు.. మ‌రాఠ్వాడాలో 10 మంది మృతి

కెప్టెన్ అమరీందర్ సింగ్ పక్కన పెట్టి…పీసీసీ పెత్తనాన్ని సిద్ధూ అప్పచెప్పి..ముఖ్యమంత్రి మార్పు చేసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. సిద్ధూ రాజీనామా చేయడంతో…అధిష్టాన మాటకు విలువ ఇవ్వలేదు, గౌరవానికి భంగం కలిగించారని కీలక నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో..చరణ్ జీత్ సింగ్ నిర్వహించే కీలక సమావేశంలో…పీసీసీ నూతన ఎంపిక ఉంటుందా ? లేక సిద్ధూను కొనసాగిస్తారా ? అనేది తెలియరావడం లేదు. త్వరలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో..రాజీనామాలు చేస్తూ..పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని కొంతమంది లీడర్స్ వ్యాఖ్యానిస్తున్నారు.

Read More : Navjot Sidhu : సీఎం ముందే సిక్స్ కొట్టిన సిద్ధూ

అంతా సవ్యంగా ఉందని భావిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి నవజోత్‌సింగ్‌ రాజీనామా చేయడం రాజకీయంగా కలకలం సృష్టించింది. తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు. పంజాబ్ సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్‌ విషయంలో రాజీపడబోనంటూ లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సిద్ధూకు మద్దతుగా ఇద్దరు మంత్రులు రజియా సుల్తానా, పరగత్‌ సింగ్‌ రాజీనామా చేయడంతో పార్టీ సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది.మరికొంత మంది రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

Read More : Punjab Congress: పంజాబ్ పీసీసీ పగ్గాలు సిద్ధూకే.. కాంగ్రెస్ అధికారిక ప్రకటన

మొన్నటిదాకా ప‌ట్టుబ‌ట్టి కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ ముఖ్యమంత్రి ప‌ద‌వి నుంచి దిగిపోయేలా చేసిన నవ్‌జ్యోత్‌ సింగ్ సిద్ధూ.. ఇప్పుడు పీసీసీ చీఫ్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం స‌ర్వత్రా చ‌ర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల సిద్దూ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అధిష్టానం సీఎం పదవిని చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీకి కట్టబెట్టింది. అటు కేబినెట్‌లో తన వ్యతిరేకులు ఇద్దరికి పదవులు కట్టబెట్టడంపై, అధికారుల బదిలీ విషయంలోనూ సిద్ధూ నిరాసక్తంగా ఉన్నారు. పార్టీ తన మాట వినడం లేదన్న అసంతృప్తితోనే సిద్దూ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Read More : Sidhu: సిద్ధూపై హైకమాండ్ సీరియస్.. హద్దుల్లో ఉండాలంటూ సీఎం వార్నింగ్!

ఎంతో నమ్మకంతో అమరిందర్‌సింగ్‌ను సైతం పక్కనబెట్టి పీసీసీ పగ్గాలను కాంగ్రెస్‌ హైకమాండ్ అప్పజెబితే…పార్టీ నెత్తినే చేయిపెట్టి సిద్ధూ తప్పుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం పదవి దక్కక అసంతృప్తితో ఉన్న సిద్ధూ ఆకస్మికంగా పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజా పరిణామాలతో పంజాబ్‌ కాంగ్రెస్‌లో ఎక్కడ లెక్క తప్పిందని వెతికే పనిలో పడింది కాంగ్రెస్ హైకమాండ్.