Punjab Crises: పంజాబ్‌లో సంక్షోభం.. హైకమాండ్ ఆదేశం.. సీఎం రాజీనామా?

పంజాబ్ కాంగ్రెస్ అంతర్యుద్ధం మధ్య, ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను సీఎంగా తొలగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.

Punjab Crises: పంజాబ్‌లో సంక్షోభం.. హైకమాండ్ ఆదేశం.. సీఎం రాజీనామా?

Amarindhar

Punjab Crises: పంజాబ్ రాజకీయాలలో శనివారం(18 సెప్టెంబర్ 2021) పెద్ద మార్పు చోటుచేసుకుంది. పంజాబ్ కాంగ్రెస్ అంతర్యుద్ధం మధ్య, ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను సీఎంగా తొలగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ యాక్టింగ్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను రాజీనామా చేయమని కోరారు. గత కొన్ని రోజులుగా, అమరీందర్ సింగ్‌ను తొలగించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సాయంత్రం జరిగే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో కొత్త సీఎం గురించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.

శాసనసభ పార్టీ సమావేశం సాయంత్రం 5 గంటలకు పంజాబ్ కాంగ్రెస్ భవన్‌లో జరుగుతుంది. మరోవైపు, 2 గంటలకు నిర్వహించాల్సిన తన మద్దతుదారుల సమావేశాన్ని కెప్టెన్ అమరీందర్ సింగ్ రద్దు చేసుకున్నారు. అయితే, సాయంత్రం 4గంటలకు ఆయన రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు అమరీందర్ తన మద్దతుదారులతో మాట్లాడినట్లు సమాచారం. పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ మరియు పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేర్లు కొత్త CMల రేసులో ఉన్నాయి. పంజాబ్‌కు చెందిన ముగ్గురు తిరుగుబాటు మంత్రులు, ట్రిప్ట్ రాజిందర్ సింగ్ బజ్వా, చరంజిత్ సింగ్ చాన్నీ మరియు సుఖ్జీందర్ సింగ్ రాంధవా పంజాబ్ కాంగ్రెస్ భవన్‌కు చేరుకున్నారు. పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ రాణా కెపి సింగ్ కూడా రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్నారు.

ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సోనియా గాంధీకి ఫోన్ చేశారని, రాజీనామా చెయ్యమని కోరారని, అటువంటి అవమానాన్ని తాను సహించనని అమరీందర్ సింగ్ చెప్పినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్‌తో కూడా అమరీందర్ మాట్లాడినట్లు సమాచారం. అయితే, ఇది అధికారికంగా ధృవీకరించబడలేదు. మరోవైపు, తనను సీఎం పదవి నుంచి తొలగిస్తే కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతానని కెప్టెన్ కూడా తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలలు మాత్రమే మిగిలి ఉన్నందున, కాంగ్రెస్ తన బలమైన ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అధికారిక ధృవీకరణ ఇంకా చేయబడనప్పటికీ, పంజాబ్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ హరీష్ రావత్ చండీగఢ్‌కు చేరుకోవడంతో వార్తకు బలం చేకూరినట్లుగా అయ్యింది. కెప్టెన్ తన రాజీనామాను సమర్పించమని కోరారు.

మూడు రోజుల క్రితం, దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ సోనియా గాంధీకి లేఖ రాశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు, ఈరోజు సాయంత్రం 5 గంటలకు చండీగఢ్‌లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగబోతుంది. అయితే సమావేశానికి ముందు పెద్ద వార్తలు బయటకు వస్తున్నాయి.