Sidhu: సిద్ధూపై హైకమాండ్ సీరియస్.. హద్దుల్లో ఉండాలంటూ సీఎం వార్నింగ్!

పంజాబ్‌లో కాంగ్రెస్‌కు రెండుసార్లు అధికారం ఇచ్చిన కెప్టెన్ అమరీందర్ సింగ్ ముందు నవజ్యోత్ సిద్ధూ, అతని వర్గం ప్రభావం చూపలేకపోతుంది.

Sidhu: సిద్ధూపై హైకమాండ్ సీరియస్.. హద్దుల్లో ఉండాలంటూ సీఎం వార్నింగ్!

Captain

Sidhu Weakened in front of high command: పంజాబ్‌లో కాంగ్రెస్‌కు రెండుసార్లు అధికారం ఇచ్చిన కెప్టెన్ అమరీందర్ సింగ్ ముందు నవజ్యోత్ సిద్ధూ, అతని వర్గం ప్రభావం చూపలేకపోతుంది. ఒక నెల క్రితం పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిపిసిసి) అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సిద్ధూ వర్గం రాష్ట్రంలో తిరుగుబాటుకు ప్రయత్నించింది. కానీ 24 గంటల కంటే తక్కువ వ్యవధిలోనే అతని ప్రణాళికలు ఫలించట్లేదు. మరోవైపు, కాంగ్రెస్ హైకమాండ్, మొత్తం పరిణామాలను తీవ్రంగా పరిగణించి, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ హరీష్ రావత్ ద్వారా మొదటిసారిగా, సిద్ధూకు వ్యతిరేకంగా ప్రకటన ఇప్పించింది.

డెహ్రాడూన్‌లో సిద్ధూ శిబిరంలోని మంత్రులు మరియు ఎమ్మెల్యేలను కలిసిన తర్వాత, కాంగ్రెస్ పంజాబ్ ఇన్‌ఛార్జ్ హరీష్ రావత్ మాట్లాడుతూ, “పంజాబ్‌లో నవజోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ అధిపతి మాత్రమే, మొత్తం పార్టీ తన ఆస్తి కాదని అన్నారు. సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ నేతృత్వంలోనే 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేసింది అధిష్ఠానం.

పంజాబ్ కాంగ్రెస్ పీసీసీగా సిద్దూకి పదోన్నతి కల్పించడం పట్ల సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. తన సలహాదారులను తొలగించుకోవాలని సిద్దూకి సూచించారు పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి హరీష్ రావత్. పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్దూ వర్గాల మధ్య కొనసాగుతున్న విభేదాలు కొనసాగుతున్న వేళ కాశ్మీర్ అంశంపై సిద్దూ సలహాదారుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే రాష్ట్రంలో దుమారానికి కారణం అయ్యింది.

ఈ క్రమంలోనే సిద్ధూకు సలహాదారుగా ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారంకు కారణం అవుతున్నాయి. కశ్మీర్, పాకిస్తాన్ లాంటి సున్నితమైన జాతీయ సమస్యలపై సిద్ధూకు సంబంధించిన ఇద్దరు సలహాదారులు చేసిన “దారుణమైన, అనాలోచితమైన” వ్యాఖ్యలే ఈ పరిస్థితికి కారణం అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పంజాబ్ సీఎం వార్నింగ్ ఇచ్చారు. సున్నితమైన అంశాలపై ప్రకటనలు చేయవద్దని, హద్దుల్లో ఉండి మాట్లాడాలని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ అన్నారు.